ఆంధ్రప్రదేశ్‌

256 పోస్టుల భర్తీకి ఎపిపిఎస్‌సి నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 1: ఖాళీ పోస్టుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తొమ్మిది రకాల ఉద్యోగాలకు సంబంధించి 256 పోస్టుల భర్తీకి శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. సహాయ ఇంజనీర్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల్లో కొన్నింటికి బిటెక్‌తో పాటు డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులు. అయితే బిటెక్ సివిల్ చేసినవారికి ఉద్యోగాలు ఎక్కువగా వున్నాయి. సహాయ ఇంజనీర్ ఉద్యోగాలకు లక్ష పైగా దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. డెంటల్ సహాయ సర్జన్, సహాయ ఇంజనీర్, సహాయ హైడ్రోజియాలజిస్ట్ ఉద్యోగాలకు 18 నుంచి 40 సంవత్సరాలు, ఎన్విరాన్‌మెంటల్ విభాగంలో సహాయ ఇంజనీర్ పోస్టుకు 21 నుంచి 40 సంవత్సరాలు, సంక్షేమ ఆర్గనైజర్ పోస్టులకు 18 నుంచి 45 సంవత్సరాలు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టులకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయోపరిమితిని నిర్ణయించడం జరిగింది. వీటిల్లో డెంటల్ సహాయ సర్జన్, సహాయ ఇంజనీర్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఉద్యోగాలకు ఈనెల 5 నుంచి 31 వరకు, మిగతా పోస్టులకు 7 నుంచి నవంబరు 2 వరకు స్వీకరిస్తారు. అత్యధికంగా మున్సిపల్ సహాయ ఇంజనీర్ (సివిల్) 106 పోస్టులు, మున్సిపల్ ప్రజారోగ్యం విభాగంలో సహాయ ఇంజనీర్ పోస్టులు 50, మున్సిపల్ ప్రజారోగ్యంలో సహాయ ఇంజనీర్ సివిల్, మెకానికల్ పోస్టులు 34, హైడ్రోజియాలజీలో సాంకేతిక సహాయకుల పోస్టులు 13, భూగర్భ వనరులశాఖలో సహాయ హైడ్రోజియాలజిస్టుల పోస్టులు 12 వున్నాయి. ఇక భూగర్భ జలశాఖ, సివిల్ సహాయ ఇంజనీర్ పోస్టులు 9, ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో డెంటల్ సహాయ సర్జన్ పోస్టులు 2, జిల్లా సైనిక సంక్షేమాధికారి పోస్టులు 7, భూగర్భ వనరుల శాఖలో సహాయ హైడ్రోలజిస్ట్‌ల పోస్టులు 9, సైనిక వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ విభాగంలో 6, భూగర్భ వనరులశాఖలో ల్యాబ్ సహాయకులు 3 వున్నాయి.