ఆంధ్రప్రదేశ్‌

దసరా మహోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/ శ్రీశైలం, అక్టోబర్ 1: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో 11రోజులపాటు జరిగే దుర్ముఖ నామ దసరా మహోత్సవాలు శనివారం తెల్లవారుఝామున వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అలాగే రాజధాని ప్రాంత అధికార ఉద్యోగులకు సెలవుదినం కావటంతో దుర్గమ్మను దర్శించుకునేందుకై తెల్లవారుఝాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, ఉదయం ఏడున్నర గంటల నుంచి నిత్యార్చనాధికాల అనంతరం అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించారు. అంతకుముందు దివ్యచందనం శోభిత పసుపుతో అమ్మవారి మోమును అలంకరించారు. సరిగ్గా ఉదయం 9 గంటల ప్రాంతంలో అంతరాలయ బంగారు తాపడ తలుపులు తెరిచిన వెంటనే పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి ప్రప్రథమంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. స్వర్ణ కవచంపై నేరుగా సూర్యుని కిరణాలు పడటంతో పాటు ఆ కవచంలో సర్వ దేవతల శక్తి అంతా కూడా ఇమిడి ఉంటుందని ప్రతీతి. స్వర్ణ కవచ అలంకారంలో భక్తులను దుర్గమ్మ కనువిందు చేసింది. అమ్మవారి ఉత్సవమూర్తులను నిత్య కుంకుమార్చన నిమిత్తం మేళతాళాలతో ఊరేగిస్తూ వేద పఠనాలతో స్వాగతిస్తూ సకల ఉపచారాలు చేసి మహామంటపంలోని ఆరవ అంతస్తుకు తీసుకువచ్చారు.
భృంగివాహనంపై ఆది దంపతులకు గ్రామోత్సవం
శ్రీశైలంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీభ్రమరాంబదేవికి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షా సంకల్పం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పన, అగ్ని ప్రతిష్టాపన, అమ్మవారికి నవవరణార్చన, కుంకుమార్చనలు నిర్వహించారు. రుద్రహోమం, చండీహోమం అనంతరం రాత్రి 9 గంటల నుంచి సుహాసిని పూజ, కాలరాత్రిపూజ చేశారు. ఈసారి నవదుర్గ అలంకారాలతోపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయం మెట్లమార్గంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి అమ్మవారికి విశేష పూజాదికాలు జరిపించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాల అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ జగోపురం నుండి గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు.

చిత్రాలు..కుంకుమ పూజలకు తరలివెళుతున్న విజయవాడ దుర్గమ్మ
శైలపుత్రి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక