ఆంధ్రప్రదేశ్‌

నకిలీ కంపెనీలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 1: నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న కావేరి సీడ్స్, జీవా సీడ్స్ సంస్థలపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. శనివారం గుంటూరు ఆర్ అండ్ బి అతిథిగృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కావేరి సీడ్స్ రూ. 42 లక్షల 92వేల 262 మేర రైతులకు పరిహారం చెల్లించాలని నోటీసులు పంపామని, స్పందించక పోతే రాష్ట్రంలోని ఏ జిల్లాలో విత్తనాలు సరఫరా చేయకుండా లైసెన్స్‌ను రద్దుచేస్తామన్నారు. నకిలీ విత్తన విక్రేతలపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదుచేసి అరెస్టు చేసేందుకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. జీవా సీడ్స్ కంపెనీ 254 కిలోల మేర నకిలీ మిరప విత్తనాలు విక్రయించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మేడికొండూరు, అమరావతి ప్రాంతాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు జరిగాయని వివరించారు. బాధిత రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. విత్తనాల కొనుగోలులో రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలతో పాటు విక్రేతలపై కూడా కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. భారీవర్షాలు, వరదలకు గుంటూరు జిల్లాలో 26వేల 44 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని 39వేల 771 మంది రైతులకు రూ. 38.28 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. బీమాలేని వరి, పత్తి పంటలకు హెక్టారుకు రూ. 15వేల వరకు పెట్టుబడిలో రాయితీలు కల్పిస్తామని వెల్లడించారు.