ఆంధ్రప్రదేశ్‌

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతికలోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, అక్టోబర్ 1: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం సమీపంలో సర్పవరం రైల్వే స్టేషన్ వద్ద గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 8.40 గంటలకు సుమారు 35 నిమిషాలపాటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతోప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణికులు, రైల్వే వర్గాల సమాచారం ప్రకారం రాత్రి 8 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు మాధవపట్నం సమీపంలోకి వచ్చేసరికి ఎస్1 బోగి కింద ఉన్న డైనమా వైర్లు కిందకు వేలాడి పొగలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన జనరల్ బోగీల్లో ప్రయాణీకులు చైన్ లాగి రైలు నిలుపుచేశారు. రైలు గార్డు లోపాన్ని పరిశీలించి ప్రమాదం ఏమీ లేదని ముందుకు సాగారు. ఈ సంఘటనతో సుమారు 35 నిమిషాలపాటు సర్పవరం రైల్వే స్టేషన్‌లో గౌతమి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఏమి జరుగుతుందో తెలియక ప్రయాణీకులు ఆందోళన చెందారు. రాజమహేంద్రవరంలో సాంకేతిక లోపాన్ని సరిచేయిస్తానని కంగారు పడాల్సిన అవసరం లేదని రైల్వేగార్డు ప్రయాణీకులకు ధైర్యం చెప్పినట్టు తెలిసింది. రాత్రి 8.40 గంటలకు సామర్లకోట రావల్సిన రైలు 9.20 గంటలకు వచ్చి వెళ్లింది.