ఆంధ్రప్రదేశ్‌

పన్ను రాయితీలు ప్రత్యేక ప్యాకేజీలో భాగం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ (పిఎసి) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏడు జిల్లాలకు కేంద్రం రాయితీలు ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నదని అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ముఖ్యమైన రాయితీలు వచ్చేశాయని ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమైనదంటూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రకటించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుందని ఆయన విమర్శించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలు ప్రత్యేక ప్యాకేజీలో భాగం అని, అంతర్భాగం కాదని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన రాయితీలు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనివే తప్ప 14వ ఆర్థిక సంఘం సూచనలే తప్ప మరో కొత్త విషయం కాదని అన్నారు. అదనంగా కేంద్రం నుంచి ఏమీ రాలేదని ఆయన తెలిపారు.