ఆంధ్రప్రదేశ్‌

పల్లెపల్లెలో ఎల్‌ఇడి వీధి దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: రాష్ట్రంలో దశలవారీగా 13500 గ్రామాల్లో 25 లక్షల ఎల్‌ఇడి వీధీ దీపాలను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు, రాష్ట్రం విద్యుత్ ఆదా చేసేందుకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ విద్యుత్ ద్వారా విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా చేశామన్నారు. ఎల్‌ఇడి బల్బుల వల్ల వినియోగదారులకు ఏడాదికి రూ.250 నుంచి రూ.500 వరకు కరెంటు బిల్లులను తగ్గించామన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ పొదుపుమహోద్యమంగా చేపట్టనున్నామన్నారు. విద్యుత్ పొదుపు కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.
విద్యుత్ పొదుపుకు కేంద్రం ఐదు వేల కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. 21వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసేందుకు దేశంలో 77 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఐద స్టార్ రేటెడ్ గృహోపకరణాలను వాయిదా పద్ధతపై పంపిణీ చేస్తున్నామన్నారు. రైతుకు ప్రయోజనం కలిగించే విధంగా ఆధునిక పంపుసెట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు.