ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి నోచుకోని దూరదర్శన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 2: రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలు మిన్న.. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, అనేక సంస్థలు ఒకదాని వెంట మరొకటిగా రాబోతున్నాయంటూ కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటనలపై ప్రకటనలు చేస్తూ సత్కారాలు పొందుతున్నారు. రాష్ట్ర వినజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న దూరదర్శన్‌ను యాదగిరి పేరుతో తెలంగాణా రాష్ట్రానికి పరిమితం చేసి అప్పటికే విజయవాడలో కొనసాగుతున్న రిలే కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేస్తూ సప్తగిరి పేరును కేంద్రం ఖరారు చేసింది. ఈ కేంద్రాన్ని సరిగ్గా రెండేళ్ల క్రితం నాడు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ కేంద్రం నుంచి తరలివస్తున్న సంస్థల్లో దీన్ని ప్రప్రథమంగా అభివర్ణిస్తూ ఈ దూరదర్శన్‌ను మహాకేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తక్షణం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి సరిగ్గా రెండు సంవత్సరాలైంది. పైగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను చేపట్టి రెండు మాసాలు గడుస్తున్నప్పటికీ నేటికీ నయాపైసా విడుదల కాలేదు కదా హైదరాబాద్‌లో స్థిరపడిన సిబ్బందిలో అత్యధిక మంది అదనపు సిబ్బందిగా ప్రకటించినప్పటికీ కనీసం తరలింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. దీంతో కొత్త కార్యక్రమాలు ప్రసారం కావటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వుండి అనుబంధంగా విజయవాడ, తిరుపతి, వరంగల్ కేంద్రాలు పనిచేస్తుండేవి. సప్తగిరి చానల్‌లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు నేటికీ హైదరాబాద్‌లోనే రూపొందుతున్నాయి.