ఆంధ్రప్రదేశ్‌

బిజెపి సహకరించకపోతే విభజన జరిగేదే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), అక్టోబర్ 2: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని బిజెపి, టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని, నిజానికి బిజెపి సహకారంతోనే అది జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సిఎల్ నాయుడు కళాశాలలో ఆదివారం ఆయన కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజనకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతూ కనీసం ఎటువంటి సూచనలు కూడా చేయకుండా లేఖలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఆ పార్టీ అధినాయకులకు ప్రశ్నించారు. విభజనతో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో గురైన మాట వాస్తవమే అన్నారు. అయితే చట్టంలోని అంశాలను ప్రస్తుతం పాలనలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. బిజెపి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే విభజన చట్టాల్లో ఎటువంటి సహకారం పొందుపర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో విభజించిన నవ్యాంధ్ర రాష్ట్రానికి 11 జాతీయ విద్యా సంస్థలతో పాటు రాష్ట్ర యువత భరోసా కోసం ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లోనే అప్పటి ప్రధాని హామీనిచ్చారన్నారు. అయిదేళ్లు కాదు... పదేళ్ళు కావాలని... పదేళ్ళు కాదు పదిహేనేళ్ళు కావాలని తిరుపతి, విశాఖ సభల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు. వాస్తవాలను మరుగున పెట్టారని ఆరోపించారు.