ఆంధ్రప్రదేశ్‌

సీమలో ఎన్నికల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 2 : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ (పట్ట్భద్రులు, ఉపాధ్యాయ) ఎన్నికలకు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో సీమ జిల్లాల్లో సందడి మొదలైంది. ఆయా ఎమ్మెల్సీ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులు ఓటర్లుగా నమోదు చేయిస్తూ వారిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించి ఎలాగైనా ఆ రెండు నియోజకవర్గాలను దక్కించుకోవడంపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గత ఐదారు మాసాలుగా పట్ట్భద్రులను ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతలను నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలకు అప్పజెప్పింది. ఆ మేరకు నేతలు సంబంధిత జాబితాలు సేకరించి సిద్ధం చేసుకుని ఉన్నారు. సీమ జిల్లాల్లో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్ట్భద్రుల నియోజవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. గడువు ముగిసే వారిలో ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్ ఉన్నారు. వారిద్దరూ మరోమారు బరిలో దిగనున్నట్లు సమాచారం. గతంలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి అల్లుడు ఈశ్వరరెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన బిసి సంఘం నేత నాగరాజు, కడపలో ప్రముఖ న్యాయవాది వీణఅజయ్‌కుమార్, ప్రముఖ ఆడిటర్ పి.ఖాసీంఖాన్ పోటీ పడ్డారు. వచ్చే ఏడాది జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి జిల్లా నుంచి స్వతంత్రంగా జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు పేరున్నవారు, టిడిపి, వైకాపా మద్దతుతో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. టిడిపి, వైకాపాలకు చెందిన అధిష్ఠానం ఇప్పటికే అభ్యర్థులను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎస్టీయు, పిఆర్‌టియు, ఆర్‌జెయుపి ఉపాధ్యాయ సంఘాల నేతలు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. బచ్చల పుల్లయ్య టిడిపి మద్దతుతో, ఎస్టీయు రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేనందున ఈ ఎన్నికల బరిలో దిగే నేతలకు ఆర్థిక పరిపుష్టి, రాజకీయ పరపతి అన్ని రంగాల్లో ఆరితేరిన నేతలనే బరిలో దించేందుకు టిడిపి, వైకాపా అధిష్ఠానాలు బేరీజు వేసుకుంటూ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.