ఆంధ్రప్రదేశ్‌

అరకులో డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, అక్టోబర్ 2: విశాఖ మన్యంలోని అరకులోయ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాణాంతక వ్యాధులు నమోదు కావడంతో గిరిజనుల్లో భయాందోళన మొదలైంది. కిల్లోగుడ, గనె్నల, మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోకి వచ్చే గిరిజనులు డెంగ్యూ వ్యాధి బారిన పడినట్టు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో ఎవరికి ఎప్పుడు ఈ వ్యాధి సోకుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. డుంబ్రిగుడ మండలం గసబ గ్రామానికి చెందిన వి.కొయిబి (38), అరకులోయ పట్టణానికి చెందిన (జెడ్పీ కాలనీ) పి.నిర్మల (25), ఎ.్భవాని (27), చిన్నారావు (30), మాడగడ గ్రామానికి చెందిన మజ్జి సొనాదోయి (32) బస్కికి చెందిన ముక్త (26) అనే గిరిజనులు డెంగ్యూ వ్యాధికి గురైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారిలో కొయిబి, నిర్మల, భవాని, సొనాదోయిలను మెరుగైన వైద్యం కోసం విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తరలించారు. డెంగ్యూకు గురైన మరో ఇద్దరిలో చిన్నారావు పరిస్థితి నిలకడగా ఉండడంతో చికిత్స అనంతరం వైద్యులు ఇంటికి పంపించారు. బస్కికి చెందిన ముక్త అనే గిరిజనుడికి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అరకులోయ ప్రాంతంలో డెంగ్యూ వ్యాధితో ఆరు కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గత పదిహేను రోజుల వ్యవధిలో డెంగ్యూ కేసులు నమోదైనప్పటికీ ఈ విషయాన్ని వైద్యాధికారులు ఇంతవరకు రహస్యంగా ఉంచడం గమనార్హం. వైద్య సిబ్బంది ద్వారా డెంగ్యూ విషయం వెలుగులోకి వచ్చింది.