ఆంధ్రప్రదేశ్‌

దారి తప్పిన సిఎం కాన్వాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 2: భద్రతాధికారులు, రూట్ మ్యాప్‌లో సమన్వయ లోపంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి మహతి ఆడిటోరియంకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ దారి తప్పిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లే కాన్వాయ్‌కు ముందుగా అధికారులు ఒక రూట్‌మ్యాప్‌ను తయారుచేసి వాహనాలకు ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని మహతి ఆడిటోరియంకు బయలుదేరారు. తనపల్లి క్రాస్ వద్ద ముందువెళ్తున్న కారు మరో మార్గంలో వెళ్లింది. వెనుక వస్తున్న కాన్వాయ్ ఆ వాహనం వెంటే వెళ్లింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆ మార్గంలో వాహనాలను నిలపివేసి ఉండటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వాటి మధ్యలోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఊహించని ఈ పరిణామానికి ఉలిక్కిపడ్డ అధికారులందరూ వాహనాలు దిగి పరుగులు తీశారు. ముఖ్యమంత్రితో ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న కారును చుట్టుముట్టారు. కాన్వాయ్ దారి తప్పిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే కాన్వాయ్‌ను వెనక్కు తీసుకొని ముందు నిర్ణయించిన రూట్‌గుండా మహతి ఆడిటోరియంకు చేరుకున్నారు. ఈసందర్భంగా నడిరోడ్డులో ముఖ్యమంత్రి వాహనాన్ని గుర్తించిన కొందరు ప్రజలు ఆయన వద్దకు రావడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఏదిఏమైనా జడ్ కేటగిరి భద్రత కలిగిన ముఖ్యమంత్రి కాన్వాయ్ రూట్ పట్ల భద్రతాధికారుల మధ్య ఏర్పడిన సమన్వయలోపం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు.