ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ ప్రసాదంపై పురుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 2: గాలి కోసం ఆరబెట్టిన అమ్మవారి ప్రసాదం లడ్డూలపై పురుగులు వాలడటంతో సుమారు 50 వేల లడ్డూలను ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. లడ్డూల తయారీ కేంద్రంలో ముందుగా తయారైన సుమారు 90 వేల లడ్డూలను ప్యాక్ చేసేందుకు ఆలయ సిబ్బంది అరబెట్టారు. కొన్ని లడ్డూలపై పురుగులు పడి ఉండటం గమనించి ఒక ఛానల్ ప్రతినిధి ఇవో కార్యాలయ సిబ్బందికి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ నోటా ఈ నోటా ఇది ప్రచారం కావడంతో మిగిలిన విలేఖర్లు, కొంతమంది ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఇఒ సూర్యకుమారి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈలోగా లడ్డూలపై పురుగులు వార్త కొన్ని ఛానళ్లలో ప్రసారమవడంతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరబెట్టిన లడ్డూలను సీజ్ చేసారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఇవో సూర్యకుమారి మాట్లాడుతూ కేవలం 10 లడ్డూలపైనే పురుగులు వాలాయని చెప్పారు. ఆదివారం తెల్లవారు జామున వర్షం పడటం... చల్లదనం, కొండ ప్రాంతం కావటంతో కొన్ని పురుగులు వచ్చి వాలాయని ఆమె వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కేవలం పరిశీలన కోసమే లడ్డూలను సీజ్ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.

చిత్రం.. లడ్డూ ప్రసాదాలపై వాలిన పురుగులు