ఆంధ్రప్రదేశ్‌

సీమను సస్యశ్యామలం చేస్తాం : గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 2 : రాయలసీమను కరవు రహిత సీమగా మార్చి సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలను ఆదివారం జిఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువ ద్వారా జిల్లాకు విడుదల చేశారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ 1000 క్యూసెక్కుల చొప్పున వరద కాలువకు నీటి విడుదల జరుగుతుందన్నారు. వరద కాలువ ద్వారా వచ్చే కృష్ణా జలాలు మైలవరం, గండికోట జలాశయాలకు చేరతాయని, తద్వారా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజల దాహార్తి తీరుతుందన్నారు. ప్రకటించిన విధంగా సిఎం చంద్రబాబు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం నదుల అనుసంధానం ద్వారా తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు విశేష కృషి చేస్తోందన్నారు. జిల్లా అభివృద్ధికి సిఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. ఇక్కడి రైతుల, ప్రజల తాగు, సాగునీటి కష్టాలు చూసి శ్రీశైలం నుంచి కృష్టా జలాలను జిల్లాకు తెచ్చేందుకు ప్రతిన పూనారన్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాలు జిల్లాకు రావడంతో ప్రతిన నెరవేరిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, టిబిపిహెచ్‌ఎల్‌సి చైర్మన్ ఎంబి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. అవుకు రిజర్వాయర్ నుంచి జిఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలు