ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మచారిణిగా భ్రమరాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 2 : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శివపార్వతులు మయూర వాహనంపై కొలువుదీరి శ్రీశైల మాడవీధుల్లో ఊరేగారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చక వేద పండితులు అమ్మవారికి శ్రీచక్రార్చన, నవవర్ణ అర్చనలు, చండీ హోమం, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగ జపాలు, పారాయణాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే నవగ్రహ మండపారాధనలు, నవగ్రహ జపానుష్ఠానములు, పంచాక్షరీ, భ్రామరీ, బాలమూలమంత్ర అనుష్టానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణం, సూర్యనమస్కారాలు, కుమారి పూజ, మధ్యాహ్న కాలార్చన, శాస్తన్రామార్చన విశేషంగా జరిపించారు. సాయంకాలం అనుష్టానములు, నవవర్ణ కుంకుమార్చనలు, చండీ హోమం, రుద్రహోమం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కుమారి పూజ జరిపించారు. రాత్రి సుహాసిని, కాళరాత్రి పూజలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. బ్రహ్మచారిణిగా అలంకరించిన అమ్మవారికి ఆలయ అర్చక వేద పండితులు అలంకరణ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూర వాహనంపై కొలువుదీర్చి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు అడుగడుగునా నారికేళ సమర్పణ, కర్పూరహారతులతో నీరాజనం పట్టారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన జానపద కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.