ఆంధ్రప్రదేశ్‌

పేదల సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 2: ‘ఆ కలియుగ వేంకటేశ్వరుడు నాకు ఎంతకాలం శక్తి, యుక్తి, పరపతి, హోదా ఇస్తాడో వాటన్నింటినీ పేదల సంక్షేమానికే వినియోగించి పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే చేయడమే తన జీవిత లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్ర్తీలు జన్మించిన రోజున రెండు జనహిత కార్యక్రమాలైన ఆత్మగౌరవం పేరిట చేపట్టిన మలమూత్ర రహిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం, అసంఘటిత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చంద్రన్న బీమా పథకంలో లబ్ధిదారులైన వారు ఏ సమస్య వచ్చినా 155214 నెంబర్‌కు ఫోన్‌చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. 2003లో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వెళుతూ స్విమ్స్‌లో ప్రాణదాన పథకాన్ని ప్రారంభించానన్నారు. అటు తరువాత తిరుమలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఆ సంఘటనలో ప్రాణాలు కాపాడింది ఆ వేంకటేశ్వర స్వామేనని అన్నారు. మంచి పనులు చేయడానికి ఆ స్వామి ప్రసాదించిన ఈ పునర్జన్మను పూర్తిగా పేదలకే అంకింతం చేసేందుకే నిర్ణయించుకున్నానన్నారు. ఇక చంద్రన్న బీమా పథకం అసంఘటిత కార్మికులకు ఒక వరం అన్నారు. రూ.15 చెల్లించే ప్రతి కార్మికుడికి చంద్రన్న బీమా పథకం ద్వారా వారి కుటుంబానికి ఒక భరోసా లభిస్తుందన్నారు. తాను ఏర్పాటు చేసిన ఈ పథకంతో రాష్ట్రంలో 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు లబ్ధిదారులవుతారన్నారు. ఉపాధి, వ్యవసాయ, పాడి, మత్స్య, చేనేత, కుమ్మరి, చర్మకారులు, రజకులు స్వయం ఉపాధి, చేనేత వృత్తులతో జీవిస్తున్న ప్రతి కార్మికుడు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్రైవేటు హాస్పిటల్‌లో కార్మికులతోపాటు పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, సిబ్బంది అందరూ కూడా ఈ పథకానికి అర్హులన్నారు. ప్రమాదవశాత్తూ చనిపోయినా, ప్రమాదంలో పూర్తిగా వికలాంగులైనా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి చెల్లించడం జరుగుతుందన్నారు. పాక్షికంగా వికలాంగులైతే రూ.3 లక్షల 52వేల రూపాయలు చెల్లిస్తామన్నారు. సహజ మరణానికి రూ.30 వేలు అందిస్తామన్నారు. ఆ కుటుంబంలో 9, 10 తరగతుల చదువు, ఐఐటి చదివిందేందుకు ఒక్కొక్కరికి 1200 చొప్పున ఇద్దరికి ఉపకారవేతనం చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా అంత్యక్రియలకు 2400 రూపాయలు, ఇద్దరు పిల్లలకు 4,500 వేల రూపాయలు మొత్తం 7 వేల రూపాయలు తక్షణం చెల్లించడం జరుగుతుందన్నారు. పేదవారు అనారోగ్యంతో బాధపడే పరిస్థితి లేకుండా ఎన్టీఆర్ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అంటువ్యాధులు సోకకుండా దోమలపై యుద్ధం ప్రకటించామన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కల్పించి పరిశుభ్రమైన గ్రామాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో 1365 పంచాయతీలు, 110 మునిసిపాలిటీలను ఓడిఎఫ్‌లుగా ప్రకటించడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రుణమాఫీ చేశామని, వారికి రివాల్వింగ్ ఫండ్ అందిస్తున్నామన్నారు. ఈ మాసంలో ప్రతి డ్వాక్రా మహిళకు 3 వేల రూపాయలు ఆంక్షలు లేని నగదును ఉచితంగా అందిస్తామని, దీంతో మహిళలు జల్సాగా ఖర్చు పెట్టుకోవచ్చని ఆయన చమత్కరించారు. రైతులకు 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికే దక్కిందన్నారు. ప్రతి ఇంటికీ ఒక పెద్దకొడుకుగా ఆ ఇంట్లోని వృద్థులను, వికలాంగులను, వితంతువులను ఆదుకునేలా ప్రతినెలా 1వ తేదీన జీతభత్యాల తరహాలో పింఛన్ అందజేస్తున్నామన్నారు. ఆహార భద్రత కోసం నిత్యావసర సరుకులను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడు, పేద మహిళ ఇంట్లో కూర్చొని వారి సమస్యలను తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేసేవిధంగా సెల్‌ఫోన్‌లు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. చిత్తూరుజిల్లా లాంటి జిల్లాల్లో 2 పాడిపశువులను కొంటే రూ.10 వేల ఆదాయం సంపాదించుకోవచ్చన్నారు. ఇందుకు పాడి పశువులకు అవసరమైన దాణాను 50 శాతం సబ్సిడీతో ఇంటికందేలా చేస్తానన్నారు. పథకాల అమలులో ఏదైనా పొరపాట్లు జరిగినపుడు తక్షణం స్పందించి ఫిర్యాదుచేసి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 13జిల్లాల్లో 175 టౌన్‌షిప్‌లు రానున్నాయన్నారు. అక్కడ వారి వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఉత్పత్తులను విక్రయించుకోవడానికి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయన చంద్రన్న బీమా పథకంలో లబ్ధిదారులైన పలువురికి బీమా ధ్రువపత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు, ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు, ఎంఐసి ఛైర్మన్ శర్మ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ జిఎం ప్రవీణ్‌గాంధీ, సెక్రటరీ అనంతరామ్, కమిషనర్ ఎర్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... చంద్రన్న బీమా ధ్రువపత్రాన్ని లబ్ధిదారునికి అందజేస్తున్న దృశ్యం