ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 2: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడిని మాడవీధుల ప్రదక్షిణగా నైరుతి దిశలోని వసంతం మండపం వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో భూమిపూజ నిర్వహించి, పాలికలలో పుట్టమన్ను సేకరించారు. అనంతరం ఊరేగింపుగా సేనాధిపతి ఆలయానికి చేరుకున్నారు. సంపంగి ప్రాకార మండపంలో అంకురార్పణ సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ నవధాన్యాలతో బీజవాపనంలో అంకురార్పణ ముగిసింది. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంరంభం ప్రారంభం కానుంది. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇదిలావుండగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సోమవారం నుంచి ప్రారంభంకానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి నూతనంగా తయారుచేయించిన ముత్యపు పందిరి వాహనం ఆదివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.
chitram....
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగిన సందర్భంగా
విష్వక్సేనుల వారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న దృశ్యం