ఆంధ్రప్రదేశ్‌

పాక్ పప్పులు ఇక ఉడకవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: పాక్ పప్పులు ఇక ఉడకవని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఉరీపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో మన దేశ సైన్యం సరైన గుణపాఠం చెప్పిందని చెప్పారు. 1926 నుంచి కార్మికుల కోసం ఉన్న 44 చట్టాలను సరళీకృతం చేసి 4 సంపుటాలుగా చేయబోతున్నామని అన్నారు. దీంతో యాజమాన్యాలకు, కార్మికులకూ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. దీనిని మంత్రివర్గం ఆమోదించిందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సామాజిక భద్రత ఏర్పడుతాయని ఆయన తెలిపారు. బూజుపట్టిన పాత చట్టాలు ఉండవని అన్నారు. ఉత్పాదకత పెరిగి వేతన వ్యవస్థ బలపడుతుందని ఆయన తెలిపారు.
చంద్రబాబుతో భేటీ
దసరా పండుగ సందర్భంగా ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించబోయే ఆలయ్-బలయ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కోరానని తెలిపారు. చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు విశాఖపట్నంలో 500 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి, విజయవాడలో వంద, అమరావతిలో వంద పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు గురించి కోరారన్నారు.