ఆంధ్రప్రదేశ్‌

ఆనాడు పదేళ్లు కావాలన్నారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కావాలని నాడు రాజ్యసభలో డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రావడం లేదా? అని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని ఇచ్చిన హామీలను, చట్టంలో పేర్కొన్న అంశాలను పూర్తిగా విస్మరించారని ఆయన సోమవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మహిళా ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవానీ, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. 11 రాష్ట్రాలకు ఏ రకంగా ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఇచ్చిన 15 శాతం ప్రత్యేకంగా ఎపికి ఇచ్చింది కాదని, ఎపితో పాటు పశ్చిమ బంగా, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదన్నారు. రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగ సమస్య కొంత తీరుతుందని అన్నారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు నాడు పార్లమెంటులో, ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రణాళికలో ఐదు సంవత్సరాల రాయితీలు ఇస్తే పరిశ్రమలు రావని, పరిశ్రమలు నెలకొల్పడానికి రెండు, మూడు సంవత్సరాలు సరిపోదని కనీసం 10 సంవత్సరాలు పడుతుందని అన్నారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ప్రైవేటు బిల్లు పెడితే అది ఫైనాన్స్ బిల్లు అని, తర్వాత బిల్లుకు ఓటింగ్‌లో కోరం లేదని తిరస్కరించారని ఆయన చెప్పారు. మీరు బిల్లు పెట్టండి తాము పాస్ చేస్తామని ఆయన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు సమాధానంగా తెలిపారు.