ఆంధ్రప్రదేశ్‌

పత్తి కథ కంచికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,అక్టోబర్ 3: దేశంలో సంచలనం సృష్టించిన పత్తి అక్రమ కొనుగోల్‌మాల్ కథ కంచికి చేరే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 700 కోట్ల రూపాలయ మేరకు జరిగిన ఈ కుంభకోణంలో నిందితులెవరన్నది దర్తాప్తు సంస్థలు విచారించి నివేదికలిచ్చినా, ఇప్పటివరకూ వారిపై చర్యలు తీసుకోకపోవడంపై కొనుగోల్‌మాల్ నివేదికను సమాధి చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రప్రభుత్వ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2014-15 సంవత్సరంలో భారీ ఎత్తున పత్తి కొనుగోళ్లు జరిగాయి. అయితే అందులో దాదాపు 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో నష్టనివారణకు దిగిన సీసీఐ, ఆ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులందరినీ దేశవ్యాప్తంగా బదిలీ చేసింది. కానీ గుంటూరు కేంద్రంగా మన రాష్ట్రంలో జరిగిన ఈ కుంభకోణంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మార్కెటింగ్ విభాగ అధికారులు నివేదికలు సమర్పించారు. 64మంది మొత్తం 43 మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. కానీ వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా కొందరు అధికారులు, అక్రమార్కులు కలిసి.. ఒక మంత్రి గారి భార్య ద్వారా వ్యవహారం సెటిల్‌మెంట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అక్రమార్కులంతా గుంటూరులో భేటీ అయి, డీల్ ఫైనల్ చేసేందుకు చర్చిస్తున్నారన్న వార్త పొక్కడంతో ఎక్కడివారక్కడ పరారయినట్లు సమాచారం. తాజా పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బాబు పారదర్శక పాలన, అవినీతిరహిత పాలన అని నినదిస్తుంటే మరోవైపు మంత్రులు, వారి కుటుంబసభ్యులు అడ్డగోలుగా కౌంటర్లు తెరిచి, అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
రెండున్నరేళ్ల నుంచి మంత్రుల భార్యలే పెత్తనం చేస్తున్నారని, డీలర్లకు నేరుగా ఫోన్లు చేసి వచ్చిన కోటానంతా తాము సూచించిన వారికి ఇప్పిస్తున్నారంటున్నారు. ఇటీవల ఒక నర్సరీ కోసం ఒక మంత్రి గారి భార్య పెద్ద మొత్తంలో కోటా ఇప్పించారని, కోటా ఇచ్చేందుకు నిరాకరించిన డీలర్ల షాపులపై దాడులు చేయిస్తున్నారని, అందులో తమ పార్టీ వారే ఎక్కువమంది బాధితులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల కోసం ఎప్పుడూ లేనంత డిమాండ్ ఉందని దానిని కొంతమంది మంత్రుల భార్యలు వినియోగించుకుని, తొలిసారి చివరకు యార్డుల వద్ద పెట్టి విత్తనాలు, యూరియాను అమ్మించి సొమ్ము చేసుకున్నారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, తమ కళ్లెదుటే జరుగుతున్న ఈ అక్రమాలు ప్రజల్లో ఎలాంటి సంకేతం వెళతాయో అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ వ్యవహారంపై విచారణకు సీబీఐలో డిఎస్పీ స్థాయి అధికారి ఒకరు మూడురోజుల క్రితం మార్కెటింగ్ శాఖకు వచ్చినట్లు తెలుస్తోంది. పత్తి కొనుగోలు వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? ఇందులో ఒక మంత్రికి చెందిన కంపెనీ, ఆయన ఉద్యోగుల పాత్ర ఎంత అన్న దిశగా విచారణ ప్రారంభించినట్లు సమాచారం.