ఆంధ్రప్రదేశ్‌

చంద్రఘంట అలంకరణలో భ్రమరాంబదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 3: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీభ్రమరాంబదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు రావణవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో శ్రీచక్రవర్ణ అర్చనలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహ జపానుష్టానములు, కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రహోమం, సుహాసిని, కాళరాత్రి పూజలను అర్చక వేదపండితులు విశేషంగా జరిపారు. నవదుర్గ రూపాల్లో ఒకటైన చంద్రఘంట స్వరూపంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ అలంకారంలో దేవి దశభుజాలు కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక రూపిణిగా దర్శనమిస్తుంది. దేవి శాంతి స్వరూపిణి అయినప్పటికీ ఇతోన్ముఖురాలుగా ఉండడం విశేషం. అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు ఉండడం చేత చంద్రఘంట దేవిగా పిలుస్తారు. చంద్రఘంట అలంకారంలోని అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తీరడమేగాక సమస్యలు సానుకూలంగా మారుతాయని పురాణాలు చెబుతున్నాయి. రాత్రి రావణవాహన సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అక్కమహాదేవి అలంకరణ మండపంలో ఆలయ అర్చక వేద పండితులు విశేషంగా సాయంకాల పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు ఇచ్చి ఆలయ గర్భాలయం మీదుగా రాజగోపురం నుంచి గ్రామోత్సవానికి తోడ్కొనివెళ్లారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండుగగా నందిగుడి, బయలువీరభద్రస్వామి, ఆలయ పురవీధుల గుండా సాగి తిరిగి ఆలయంలోకి చేరుకుంది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నారాయణ భరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి దంపతులు, ఆలయ అర్చక వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఆలయం మెట్ల మార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సోమవారం శ్రీభ్రమరాంబదేవి నిజ అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు.