ఆంధ్రప్రదేశ్‌

వేదమాత గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 3: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడోరోజైన అశ్వయుజ శుద్ధ విదియ సోమవారం జగన్మాత దుర్గమ్మ వేదమాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చింది. చతుర్వేదాలకు అమ్మగా పంచభూతాత్మగా సృష్టి, స్థితి, లయలను సమన్వితం చేసే వేదమాత గాయత్రిగా దర్శనమిచ్చిన జగన్మాత దుర్గాదేవిని కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుఝాము నుంచే తరలివచ్చి పునీతులయ్యారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలోకి తొలిరోజు అడుగిడిన ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి ముందుగా దుర్గమ్మ ఆశీస్సులు పొందారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు జ్ఞాన వైరాగ్యాలను సిద్ధింపజేసే గాయత్రీ మంత్ర విశిష్ఠతలను వారికి వివరించారు. పంచముఖాలతో ప్రకాశించే గాయత్రీమాత దర్శనం కోసం తెల్లవారుఝాము నుంచే భక్తులు బారులుదీరారు. భవానీదీక్ష మంటపంలో గాయత్రీమాతగా అలంకరించిన ఉత్సవ విగ్రహం సన్నిధిలో భక్తులు రెండు విడతలుగా ప్రత్యేక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించారు. ఇక భక్తుల సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా వినుతికెక్కిన దుర్గమ్మను పంచముఖాల్లో దర్శించుకుని తరలించారు. తెలంగాణలోని పటాన్‌చెరువుకు చెందిన భక్తుడు టి మల్లేష్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి 10 గ్రాముల బంగారు ముక్కుపుడకను సమర్పించుకున్నారు. మల్లేష్ సరిగ్గా 16 ఏళ్ల క్రితం దుర్గమ్మను దర్శించుకుని తమకు పిల్లలను ప్రసాదించాల్సిందిగా మొక్కుకున్నారు. ఆమేర వారికి దుర్గమ్మ కరుణాకటాక్షాలతో పాప పుట్టింది. ఆ పాపకు నందిని అని నామకరణం చేసి మొక్కుకున్న మేరకు దుర్గమ్మను దర్శించుకుని 10 గ్రాముల బంగారు ముక్కుపుడక, 25 కిలోల బియ్యం, పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు, చీర, రవిక సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వాసి మేడేపల్లి రమేష్ అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ కోసం రూ. 6.60 లక్షలు విరాళంగా ఇవో సూర్యకుమారికి అందజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపు 40వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. కుమారి, సువాసిని పూజలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య పట్టువస్త్రాలు సమర్పించారు.

దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తజనం