ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర బిజెపిలో తిరుగుబాటు బావుటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నామినేటెడ్ పదవుల పందారం మిత్రపక్ష భారతీయ జనతా పార్టీలో చిచ్చురేపుతోంది. క్రమశిక్షణకు పేరుగాంచిన బిజెపిలో పరిణామాలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బయలుదేరుతోంది. సోమవారం పార్టీ నగర కార్యాలయంపై కార్యకర్తలు జరిపిన దాడి వెనక నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు పాత్ర ఉందని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి హరిబాబు ఆయనను సుమోటోగా సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. పైగా సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ ఈమేర ఉదయమే ప్రకటన జారీ చేశారు. ఇదిలా ఉంటే డాక్టర్ దాసం ఆగమేఘాలపై పార్టీ కార్యాలయంలో వివిధ డివిజన్‌ల అధ్యక్షులు, పలువురు కార్యవర్గ సభుయలతో సమావేశం నిర్వహించారు. సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ డాక్టర్ దాసం అధ్యక్షునిగా కొనసాగింపజేస్తూ సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ రెండు తీర్మానాలను పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు పంపించాలని కూడా నిర్ణయించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసం మాట్లాడుతూ తనను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటికి లేదన్నారు. అసలు ఆయన పదవీకాలం ముగిసిందని ఎన్నికలు జరిపించకుండా ఆయన కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. ఇటీవలే జరిగిన నగర కమిటీ ఎన్నికల్లో తాను ప్రత్యర్థి ఎం వెంకట సుబ్బయ్యపై 42 ఓట్ల అధిక్యతతో గెలిచానన్నారు. ప్రధాన కార్యదర్శి శ్యాంకిషోర్ మొదటి నుంచి తనను అంతర్గంతగా వ్యతిరేకిస్తూ వస్తున్నారన్నారు. తాను అధ్యక్షునిగా కొనసాగుతానంటూ స్పష్టం చేశారు.