ఆంధ్రప్రదేశ్‌

రిజర్వేషన్లలో అక్రమాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రఘువీరారెడ్డి పార్టీ నాయకులతో మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంబిబిఎస్ సీట్ల ప్రవేశాలలో రిజర్వేషన్ వర్గాలకు జరిగిన జరిగిన అన్యాయం, అక్రమాలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని రఘువీరారెడ్డి గవర్నర్‌ను కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అడ్మిషన్లు జరుపుకోవడానికి అవకాశం ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తొందరపాటు చర్యల వల్ల అడ్మిషన్లు ఆగస్టు 8వ తేదీన జరిగినట్లు చెప్పారు. దీంతో ఎస్‌విఎయు పరిథిలోని ఓసి విద్యార్థులతో పాటు రిజర్వేషన్ వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోవడానికి కారణమైందని అన్నారు. తెలంగాణ ఎంసెట్ పూర్తి కాకుండానే ఎపిలో ఎంబిబిఎస్ సీట్లు భర్తీ చేయడం వల్ల సుమారు 550 సీట్లు తెలంగాణ విద్యార్థులతో బ్లాకు చేయబడ్డాయని ఆయన తెలిపారు. పద్మావతి మహిళా కళాశాల సీట్లు విడిగా భర్తీ చేయడం, 127 సీట్లు బ్లాకు చేయడంతో రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోయారని ఆయన చెప్పారు. రెండవ విడత జరిగిన కౌన్సిలింగ్‌లో రాష్ట్రానికి నూతనంగా మంజూరు అయిన సీట్లు కూడా భర్తీ కావడంతో రిజర్వేషన్ వర్గాలు (ఎస్సీ, ఎస్టీ, బిసి) 187 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఎ-కేటగిరి సీట్లు భర్తీ కాకుండానే బి-కేటగిరి సీట్లు భర్తీ చేయడంతో నిత్యం బడుగు బలహీనవర్గాల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగి మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన చెప్పారు.