ఆంధ్రప్రదేశ్‌

అరుదైన శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), అక్టోబర్ 4: ఇంతవరకూ ఇంటర్నేషనల్ జర్నల్‌లో నమోదుకాని, విశాఖ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో సాధ్యం కాని ఓ అరుదైన శస్తచ్రికిత్స శ్రీకాకుళానికి చెందిన డాక్టర్ దానేటి శ్రీ్ధర్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో దానేటి మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుని భార్య లోపింటి ధనలక్ష్మి గర్భవతి. స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ చికిత్స తీసుకునేవారు. అయితే గర్భం దాల్చి ఆరునెలలు దాటాక అక్కడి వైద్యులు స్కానింగ్ తీసి బిడ్డ సంచిలో కణితి ఉందని, గర్భసంచి తీసేయాలని చెప్పగా అవాక్కైన ధనలక్ష్మి దంపతులు విశాఖ మణిపాల్ ఆసుపత్రిలో సంప్రదించారు. అక్కడ కూడా అదే సమాధానం రావడంతో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కూడా ఆపరేషన్ చేసి బిడ్డసంచితో పాటు బిడ్డను తీసేయాలని, లేదంటే తల్లి బతకడం కష్టమని చెప్పడంతో చేసేదేమీ లేక శ్రీకాకుళం వచ్చేశారు. ఆఖరి ప్రయత్నంగా డాక్టర్ దానేటి శ్రీ్ధర్‌ను సంప్రదించారు. వివిధ పరీక్షల అనంతరం గర్భంలో ఆరుకేజీల కణితి ఉన్నట్లు గ్రహించి కణితి వెనకాల బిడ్డ సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఏ విధంగా ఆపరేషన్ చేయాలో తెలియక ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమవుతున్న ఇంటర్నేషనల్ జర్నల్‌లో విషయ సేకరణ చేశారు. ఒక విదేశీ వైద్యుడు ముందుగా బిడ్డను తీసి అనంతరం ఆరునెలలకు కణితిని తొలగించే విధంగా ఉండటాన్ని చూసి దీంతో బిడ్డ బతికే అవకాశం లేకపోగా, కొంత ఇబ్బంది ఉందని గ్రహించి ధనలక్ష్మి బంధువులతో కణితి, బిడ్డను ఒకే పర్యాయం ఆపరేషన్ చేసి తీస్తామని, అయితే ఇందులో బంధువుల సహకారం అవసరమనడంతో వారు అంగీకరించారు. తొమ్మిది నెలలు నిండిన వెంటనే ఆయన కిమ్స్‌కు చెందిన ముగ్గురు అనస్థీషియా వైద్యులు, ఒక యూరాలజిస్ట్, గైనకాలజిస్టు డాక్టర్ స్వర్ణలత సహాయంతో మంగళవారం ఆపరేషన్ పూర్తిచేసారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, భవిష్యత్‌లో కూడా ఆమె బిడ్డను కనే అవకాశం ఉందని డాక్టర్ దానేటి విలేఖర్లకు తెలిపారు. ఇది చాలా అరుదైన శస్తచ్రికిత్సగా అభివర్ణిస్తూ ఇంతవరకూ వైద్యుల జర్నల్‌లో ప్రచురితం కాని ఈ అంశాన్ని తాము అన్ని రుజువులు, నిబంధనలతో ఇంటర్నేషనల్ జర్నల్‌కు పంపిస్తామన్నారు.