ఆంధ్రప్రదేశ్‌

బ్లూగ్రీన్ నగరంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 5: రాజధాని అమరావతిని నీలం, ఆకుపచ్చ నగరంగా అభివృద్ధి చేసేందుకై ఓ ప్రణాళికాబద్ధంగా ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అనుసరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రాజధానికి కొండవీటి వాగు నుంచి ఎలాంటి వరద ముంపు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాల్లోని సహజ వనరులను కాపాడుకుంటూనే వాటి ఫలితాలు అందుకునేలా చూడాలన్నారు. దాదాపు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుతో ముడిపడి ఉన్న పశ్చిమ డెల్టా కాలువల వ్యవస్థకు ఎక్కడా భంగం లేకుండా చూడాలన్నారు. నదీగర్భంలోని దీవులు నిలకడగా ఉండేలా సుందరీకరించాలన్నారు. ప్రధానంగా కృష్ణానది నుంచి కూడా వరద రక్షణ ఉండాలన్నారు.
ఆయన తన నివాసగృహంలో బుధవారం నెదర్లాండ్స్‌కు చెందిన బ్లూ కన్సల్టెంట్ రాజ్‌స్టైన్, ఇతర నిపుణులు, సిఆర్‌డిఎ అధికారులతోనూ సమావేశమై అమరావతి బ్లూ ప్రణాళిక(నీటి వనరులు) తయారీపై చర్చించారు. రాజధానిలో ఆకుపచ్చ ప్రణాళిక(వృక్ష సంపద పెంపు) కోసం 30 శాతం భూమిని కేటాయించాలన్నారు. ప్రణాళికా బద్ధంగా చెరువులు తవ్వాలన్నారు. కొండవీటి వాగుతో పాటు కృష్ణానది వరద తాకిడిపై వందేళ్ల చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించాలన్నారు.
ఉత్తమ ఫలితాలను సాధించడానికి పర్యావరణం, అడవులు, రెవెన్యూ, నీటి పారుదల ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసేలా చూడాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ అధికారులను కోరారు. వర్తమాన, భవిష్యత్ తరాల కోసం రాజధాని ప్రజలు సురక్షితంగా భద్రంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉండాలన్నదే తన ఆకాంక్షని చంద్రబాబు చెప్పారు. నెదర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బ్లూ కన్సల్టెంట్ రాజ్‌స్టైన్ మాట్లాడుతూ 80 దేశాల్లో తాను పనిచేసిన అనుభవంతో ప్రణాళికలు రూపొందిస్తామని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సిసిడిఎంసి చైర్మన్ లక్ష్మీ పార్థసారథి, వివిధ శాఖల కార్యదర్శులు అజయ్ జైన్, జి.సాయి ప్రసాద్, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.