ఆంధ్రప్రదేశ్‌

లోకేష్.. రెండోస్సారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరులో జరుగుతున్న తెదేపా శిక్షణ శిబిరాల రెండోరోజు కార్యక్రమానికీ గైర్హాజరవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమయింది. దీనిపై సోషల్‌మీడియా, పార్టీ వ్యతిరేక మీడియాల్లో రకరకాల కథనాలు రావడమే దానికి కారణం. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి, శిక్షణ శిబిరాలకు డుమ్మా కొట్టారని తీవ్రస్థాయి ప్రచారం జరిగింది. రెండోరోజు కూడా హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఆంధ్రభూమి ప్రతినిధి దీనిపై లోకేష్ కార్యాలయాన్ని సంప్రదించగా, ఆయన గత పదిరోజుల నుంచి తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నారని, వైద్యు ల సలహామేరకు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు. అయితే, లోకేష్ మూడవ రోజు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ‘లోకేష్ పార్టీకి ప్రధాన కార్యదర్శి. బాబు తర్వాత మా సారథి ఆయనే. ఈ వర్క్‌షాప్ కోసం ఆయన చాలా శ్రమించారు. రోజుకు 15 గంటలు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అలాంటి వారసుడు మంత్రి పదవి ఇవ్వలేదని అలిగారని మీడియాలో ప్రచారం కావడం వింతగా ఉంది. దీన్నిబట్టి మా పార్టీ అంటే ఒక వర్గ మీడియాకు ఎంత విద్వేషం ఉందో అర్ధమవుతోంది. ఇది కూడా ఒకరకమైన మానసిక వ్యాధి. సోషల్‌మీడియాను ఫాలో అయ్యేవారు వాస్తవాలు ఆలోచించి ఇలాంటి కట్టుకథనాలకు వ్యతిరేకంగా కామెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని పార్టీ కార్యాలయ జాతీయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ వ్యాఖ్యానించారు.