ఆంధ్రప్రదేశ్‌

కాత్యాయనిగా కనకదుర్గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 5: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఐదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి బుధవారం దుర్గమ్మ శ్రీ కాత్యాయని దేవిగా భక్తకోటికి దర్శమిచ్చింది. పురాణ కాలంలో మహిషాసురుడుని అంతమొందించేందుకు ముక్కోటి దేవతలు , త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవిగా శక్తిని ప్రసాదించి లోక కల్యాణం కావించారు. అనేక మంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా మారారు. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని రోగాలు, భయాలు నశించి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వర్థిల్లుతాయనే సంకల్పంతో భక్తులు తెల్లవారుజామునుంచే బారులు దీరారు.
ఇదిలా ఉండగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి దుర్గమ్మను దర్శించుకోవటంతోపాటు అర్చక సభలో పాల్గొని అర్చకులకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 129 మంది ఆలయ అర్చకులకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఎ.సూర్యకుమారి ఒక్కో అర్చకునికి 3వేల 500 రూపాయలు చొప్పున పారితోషికాన్ని అందజేశారు. తొలుత కాత్యాయనీ అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ దుర్గమ్మను పల్లకిలో అర్జున వీధి నగర వీధుల్లో మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగించారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద్, క్రికెట్ టీమ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్‌ఎస్‌ఆర్‌కె ప్రసాద్ తదితరులు నేడు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ముగిసే వరకు ఏ ఒక్క భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇదిలా ఉండగా అమ్మవారికి లక్షలాది రూపాయలను విరాళంగా సమర్పించిన దాతలు డోనర్ పాస్‌లతో వచ్చినప్పటికీ తొలిసారిగా విఐపి లైన్‌లో కాకుండా ఖచ్చితంగా వంద రూపాయల టికెట్ లైన్‌లోనే రావాలంటూ ఆలయ అధికారులు ఆదేశిస్తుండటంపై దాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడిలో తమకు లభించే మర్యాద ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆరో రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తకోటికి దర్శనమివ్వనుంది.

కాత్యాయనీదేవిగా కుంకుమ పూజలందుకుంటున్న దుర్గమ్మ