ఆంధ్రప్రదేశ్‌

రూ. 2.6 కోట్ల మాదక ఔషధాల స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 6: పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో ఒక ఔషధ కంపెనీలో సుమారు 2.6 కోట్ల రూపాయల విలువ చేసే అనుమతి లేని మాదక ఔషధాన్ని ఔషధ నియంత్రణ మండలి అధికారులు బుధవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు ఫార్మాసిటీలో గల ఆ ఔషధ కంపెనీకి అనుమతి లేదు. అయినప్పటికీ రహస్యంగా అల్ఫాజెమ్ అనే డ్రగ్‌ను ఈ ఔషధ కంపెనీలో పెట్టినట్లు ఔషధ నియంత్రణ మండలి అధికారులకు సమాచారం అందింది. దీనిపై హైదరాబాద్ నుండి ఒక ప్రత్యేక బృందం ఇక్కడికి వచ్చి ఔషధ కంపెనీపై దాడులు నిర్వహించి సుమారు 100 కేజీల అల్ఫాజెమ్ డ్రగ్, మరో 62 కేజీల మాదక ఔషధాల తయారీకి వినియోగించే డ్రగ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ దాడులు బుధవారం జరిగినప్పటికీ సదరు ఔషధ కంపెనీ యాజమాన్యం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. అయితే ఈ దాడులను తొలుత ఐటి దాడులగా భావించారు. మెదక్ ఫార్మాసిటీలో ఔషధ నియంత్రణ మండలి అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ఆల్ఫాజెమ్ డ్రగ్ పరవాడ వద్ద గల ఫార్మాసిటీలో ఉన్న ఒక ఔషధ కంపెనీకి చేరినట్లు గుర్తించారు.