ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి త్రీడీ నమూనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 7: బహుళార్ద సాధక పోలవరం ప్రాజెక్టు త్రీడీ నమూనాను తయారుచేయనున్నారు. ఇందులో భాగంగా పూణె నుండి శాస్తవ్రేత్తలు శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చి ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు భాశేఖర్, మీనా జాక్ త్రిడి నమూనా తయారు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం వచ్చినట్టు ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. ఈ నమూనా తయారీకి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తారని ఎస్‌ఇ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు 2డి నమూనా పూర్తయిందన్నారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న శాస్తవ్రేత్తలు క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. స్పిల్ వే నిర్మాణ ప్రాంతాన్ని, జంట సొరంగాలను చూశారు.