ఆంధ్రప్రదేశ్‌

బిజెపి నేత రాజు సస్పెన్షన్‌పై కోర్ కమిటీలో నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: బిజెపి విజయవాడ నగర అధ్యక్షుడు డాక్టర్ ఉమామహేశ్వరరాజు సస్పెన్షన్‌పై బిజెపి కోర్‌కమిటీ చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 15న విశాఖలో కోర్‌కమిటీ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా రాజు సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఈ భేటీలో గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారన్న కింది స్థాయి శ్రేణుల మనోభావాలను కమిటీలో చర్చించనున్నారు. సస్పెన్షన్, షోకాజ్ నోటీసు కలిపి జారీ చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. షోకాజ్ నోటీసుకు రాజు సమాధానం పంపుతున్నందున, ఇక దానితో సరిపెట్టి పార్టీపై పెరుగుతున్న కులముద్రకు తెరదించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని ఒకరిద్దరు నేతలు ప్రతిష్టగా తీసుకుంటున్నారని, అది చివరకు పార్టీని బడుగుబలహీన వర్గాలకు దూరం చేసే ప్రమాదం ఉందని సీనియర్లు కోర్ కమిటీకి స్పష్టం చేయనున్నారు. సస్పెండ్ చేసిన నేతను తిరిగి ఎలా తీసుకుంటారని ఒక వర్గం ఇప్పటినుంచే వాదిస్తున్నందున, దానికి సమాధానం కోర్‌కమిటీలోనే చెప్పాలని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీని, ప్రధానిని సన్నాసి అన్న తెదేపా నేతల విమర్శలను ఖండించని వారు ఇప్పుడు సొంత పార్టీ నేతను ఎలా సస్పెండ్ చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హరిబాబును విశాఖ వేదికమీదకు ఆహ్వానించనందుకు నిరసనగా బాబు దిష్టిబొమ్మ తగులబెడితే, కేసులకు గురయిన కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యహరిస్తే చర్యలుంటాయని ప్రకటించిన వారికి, సొంత పార్టీ నేతలను సస్పెండ్ చేసే నైతిక హక్కు ఎక్కడిదన్న ప్రశ్నలు ఇప్పటికే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇవన్నీ కోర్ కమిటీలో చర్చకు రానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.