ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ గ్లోబల్ టెండర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం మరోసారి గ్లోబల్ టెండర్లు పిలిచే యోచనలో ఉంది. గత ఏడాది జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్లను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఇటీవలే రద్దయింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. అమరావతి నగర నిర్మాణం, రోడ్లు, ప్రభుత్వ భవనాల డిజైన్లు, వౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. రాజధానిలో భూములిచ్చిన అన్ని గ్రామాల రైతులకు డిసెంబర్ నెలాఖరులోగా ప్లాట్ల పంపిణీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. కొండవీటి వాగు ముంపు సమస్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. క్యాచ్‌మెంట్ ఏరియాతో పాటు కృష్ణానదీ తీరం వరకు సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రిజర్వాయర్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాజధాని అమరావతి సముద్ర మట్టానికి 17 కిలోమీటర్ల ఎత్తున ఉందంటూ నదీ పరీవాహక ప్రాంతంలో కరకట్టలను పటిష్ఠం చేసి కనెక్టివిటీని పెంచే దిశగా సమాలోచనలు జరిపారు. రాజధాని మొత్తంగా 16 వందల కిలోమీటర్ల రహదార్లు నిర్మించాలనే ప్రతిపాదనలను సిఎం పరిశీలించారు. విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవేలు కాకుండా రాజధాని ప్రాంతంలో మేజర్ ఆర్టిరియల్ రోడ్లు 500 కిలోమీటర్లు పోగా మిగిలిన 1100 కి.మీ మేర అంతర్గత రహదార్లు నిర్మిస్తారు. రైతుల ప్లాట్లలో కూడా రహదారి సౌలభ్యాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. త్వరలో రాజధాని రహదార్లకు టెండర్లు పిలవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.