ఆంధ్రప్రదేశ్‌

‘అనంత’ మేయర్‌కు పదవీ గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 16: అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూపకు పదవీ గండం పొంచి ఉంది. సొంత పార్టీ వారే ఆమె పదవికి ఎసరు పెడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి వెనకుండి పావులు కదుపుతున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ పనుల కేటాయింపులో తలెత్తిన వివాదాలే మేయర్ మార్పునకు కారణమని తెలుస్తోంది. స్వరూపను పదవి నుంచి తప్పించి మరో మహిళా కార్పొరేటర్‌ను మేయర్‌ను చేయాలని ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. పథకాల అమలులో నిధుల దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి మేయర్ స్వరూపను తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో మేయర్, ఎమ్మెల్యే ఏకమై నగరాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. ఇలా వీరిద్దరూ ఏకతాటిపై నడుస్తున్నారని భావిస్తున్న తరుణంలో మళ్లీ వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆధిపత్య పోరులో భాగంగా వీరి మధ్య వర్గ విభేదాలు పొడచూపాయి. దీంతో ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉండే నగరంలోని సప్తగిరి బల్లా లాడ్జి యజమాని బల్లా సురేష్ సతీమణి, 31వ డివిజన్ కార్పొరేటర్ బల్లా పల్లవిని మేయర్ పీఠంపై కూర్చోబెడతామని రాయబారం నడిపినట్లు తెలిసింది. ఎంత ఖర్చుపెట్టడానికైనా బల్లా సురేష్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల డిప్యూటీ మేయర్ గంపన్న, ఎమ్మెల్యే అనుంగుశిష్యులు, పలువురు కార్పొరేటర్లు ఓ కార్యక్రమంలో మేయర్ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత నెల 28న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ వర్గాన్ని ఏకాకిని చేసినట్లు సమాచారం. రెండున్నరేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జిఓ తేనుండటంతో మేయర్ పీఠానికి ఎసరు పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మేయర్‌ను ఏకాకిని చేశారని సొంత పార్టీవారే చర్చించుకోవడం గమనార్హం.