ఆంధ్రప్రదేశ్‌

అందరికీ నీటి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నీరు-ప్రగతి’పై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జలవనరులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జల సంరక్షణ చర్యల వల్లే గత ఏడాది కన్నా భూగర్భ జలమట్టం ప్రస్తుతం 2.34 మీటర్లు పెరిగిందని తెలిపారు. ఇది 209 టిఎంసిలకు సమానమన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 669 మి.మీలకు గాను 570 మి.మీల వర్షపాతం నమోదైందని, దీనిద్వారా భూగర్భ జలం 455 టిఎంసిలకు పెరిగిందని ఆయన తెలిపారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 26 టిఎంసిలు వినియోగించుకున్నామని, డిసెంబర్‌లోపు మరో 30 టిఎంసిలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఏడాది పట్టిసీమ ద్వారా 60 టిఎంసిలు వినియోగించుకుంటే వచ్చే ఏడాది 80 టిఎంసిలు వినియోగించాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది కూడా 2,800 టిఎంసిలు గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోయాయన్నారు. నీటి సంరక్షణ కోసమే ప్రతి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి సోమవారం ‘పోలవారం’గా ప్రకటించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ వారం పంట సంజీవని పనులు 58శాతం, సిసిరోడ్లు 48శాతం, మరుగుదొడ్ల నిర్మాణం 46శాతం మాత్రమే జరిగాయన్నారు. వర్మీకంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు 26శాతం మాత్రమే జరగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తపర్చారు. నాబార్డు రుణంతో వర్మీకంపోస్టు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, రామాంజనేయులు, వెంకటేశ్వరరావు, జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి న్యాయస్థానంలో వివాదాల్లో వున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చ జరగనున్నట్లు తెలిసింది.