ఆంధ్రప్రదేశ్‌

సమస్యలపై గళమెత్తిన సర్పంచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలువురు సర్పంచ్‌లు తమ గ్రామాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. గ్రామాల్లో డ్రైనేజీ, రైతుల సమస్యలు, మరుగుదొడ్లకు బిల్లుల మంజూరులో జాప్యం, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపల్లి రైతులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలో విమానాశ్రయం అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలకే పరిహారం అందిందని, మిగిలిన భూములకు కూడా వెంటనే పరిహారం అందించాలని సర్పంచ్ పైడితల్లి కోరారు. నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని కొందరు సర్పంచ్‌లు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ల అభివృద్ధి పనులను బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల ఆర్థిక సహకారంతో చేపట్టాలని నల్లజర్ల సర్పంచ్ సూచించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. నర్సరీల పెంపకంలో డ్వాక్రా మహిళా సంఘాలను, పాఠశాలలను భాగస్వాములను చేయాలని సూచించారు.
పంట కుంటల తవ్వకం పూర్తిచేయాలి
కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 20వేల పంట కుంటలు తవ్వారని, ఈ వారంలో 3603 కుంటలు తవ్వకం పూర్తయిందని అధికారులు వివరించగా మిగిలిన 5 లక్షల కుంటల తవ్వకం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రూ.11కోట్ల వ్యయంతో 11 లక్షల క్యూ.మీ. పూడికను చెరువుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు వివరించారు. జలాశయాల్లో ఉన్న నీరు, భూగర్భ జలమట్టం, ఇతర వివరాలపై వాటర్ ఆడిటింగ్ రిపోర్టులు వారంవారం అందించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా 78వేల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ఈ వారంలో 3,944 మరుగుదొడ్లు నిర్మించారని తెలిపారు. వర్మీకంపోస్టు ప్లాంట్ల లక్ష్యం 2 లక్షలకు గాను 52,800 గ్రవుండ్ చేశారని, ఈ వారంలో 2,342 చేశారని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసి 100 శాతం లక్ష్యాలను చేరుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సిసి రోడ్ల నిర్మాణం 7 జిల్లాల్లో మాత్రమే వేగంగా జరిగిందని, మిగిలిన జిల్లాలు కూడా ఆ వేగాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో వారానికి 10కి.మీల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,200 గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా మార్చారంటూ, డిసెంబర్ 31 నాటికి మరో 1000 గ్రామాలు ఓడిఎఫ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మార్చి 31 నాటికి మరో వెయ్యి గ్రామాలు ఓడిఎఫ్ పూర్తిచేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి 3 నెలలకు ప్రతి జిల్లాలో 100 గ్రామాలు ఓడిఎఫ్‌గా చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, రామాంజనేయులు, వెంకటేశ్వరరావు, జవహర్‌రెడ్డి, తదితరులు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.