ఆంధ్రప్రదేశ్‌

గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి వివిధ కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరినీ సాధ్యమైనంత మేరకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ఐటి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సౌదీలో తలెత్తిన చమురు సంక్షోభం ఆ దేశంతో పాటు అక్కడికి వెళ్లిన తెలుగు కార్మికులనూ దెబ్బతీస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై సోమవారం ఆయన ఇక్కడ స్పందించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ముఖ్యంగా తెలుగువారిని ఇబ్బందులపాలు చేస్తున్న విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు మంత్రి తెలిపారు. తెలుగువారిని ఆదుకోడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. త్వరలోనే అధికారుల బృందం, లేదా మంత్రివర్గ సభ్యుల బృందం గల్ఫ్‌లో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. సౌదీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యలకు విరుగుడుగా అక్కడి సర్కారు తీసుకుంటున్న చర్యల ప్రభావం భారతీయులపై ప్రత్యక్షంగా పడుతోందని, ప్రపంచంలోకెల్లా ఎక్కువ సంఖ్యలో 30 లక్షల మందికి పైగా భారతీయులు సౌదీలో పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. 30 లక్షల మందిలో ఎక్కువగా ఎపి, తెలంగాణ నుంచే వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. గల్ఫ్ చమురు సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన తెలుగు కార్మికులను ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వీరందరికీ స్వదేశంలో ఉద్యోగాలు కల్పించటమా? లేక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడే వారి ఉపాధి సంక్షోభానికి ప్రత్యామ్నాయాలు చూపించడమా? అనే విషయాల్లో ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్న విశాఖకు చెందిన గఫూర్ మృతదేహం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గఫూర్‌కు ఇస్తామన్న జీతం ఇవ్వకుండా అతని ఆత్మహత్యకు కారణమైన సంస్థ తరపున నష్టపరిహారం రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు.