ఆంధ్రప్రదేశ్‌

మండల కేంద్రాల్లోనూ ఎల్‌ఇడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: ఇకపై అన్ని మండల కేంద్రాల్లో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా 659 మండలాలు, 13వేల గ్రామాల్లో ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటుతో మండల పరిషత్‌లకు, గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల్లో ఆదా అవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి బల్బులు అమర్చే ప్రక్రియ పూర్తికావచ్చిందని, గ్రామాల్లో పంపిణీ చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమీక్ష జరిపారు. కాంట్రాక్టు సంస్థ ఏడేళ్ల వ్యవధిలో ఎల్‌ఇడి పంపిణీ పూర్తిచేసేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రాష్టవ్య్రాప్తంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పంపిణీ జరగాలంటే మరో మూడేళ్ల వ్యవధి పడుతుందని, ఇందుకు ప్రభుత్వం అనుమతించాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈమేరకు ప్రతిపాదనలు పంపితే వచ్చే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుందని అచ్చెన్నాయుడు సూచించారు. కాగా తొలివిడత మండల కేంద్రాల్లో విద్యుత్ పోల్స్‌పై సర్వే నిర్వహించి 5 లక్షల బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు సమావేశం ఆమోదించింది.