ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా తొలేళ్ల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),అక్టోబర్ 17: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా జరిపారు. పూసపాటి గజపతుల ఆడపడుచు, భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న పైడితల్లి అమ్మవారికి ఆలయ ఆనువంశిక ధర్మకర్త, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు దంపతులు రాజకుటుంబం తరపున పట్టు వస్త్రాలు, పసుపుకుంకుమ సమర్పించారు. మహారాజా కోట నుండి ఊరేగింపుగా పల్లకీలో అమ్మవారి పట్టు వస్త్రాలను మూడులాంతర్ల వద్ద చదురుగుడికి తీసుకుని వచ్చారు. ఆలయం వద్ద పూర్ణకుంభ స్వాగతం అనంతరం అనువంశిక ధర్మకర్త అశోక్ దంపతులు వాటిని అందుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కిమిడి మృణాళిని దంతపతులు, పలువురు ప్రముఖులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎస్పీ కాళిదాసు రంగారావు పర్యవేక్షణలో సిరిమాను జాతర బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేసారు. సుమారు రెండువేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు సిద్ధం చేసారు.

చిత్రం.. తొలేళ్ల సంబరంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు
తీసుకొస్తున్న ఆనువంశిక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు