ఆంధ్రప్రదేశ్‌

షిరిడీ సాయిబాబా దేవుడు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 18: ప్రజలు పూజిస్తున్న షిర్డీ సాయిబాబా దేవుడు, గురువు కాదని బదిరీ జ్యోతిపీఠం, ద్వారకా శారదాపీఠం పీఠాధీశ్వరులు శ్రీ స్వరుపానంద సరస్వతి మహారాజ్ పేర్కొన్నారు. దక్షిణా భారతదేశ విజయయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఆయన ఒంగోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని పివిఆర్ బాలుర హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన సభలో శ్రీ స్వరుపానంద సరస్వతి మహారాజ్ భక్తులనుద్దేశించి అభిభాషణ చేశారు. రెండు నెలల క్రితం షిర్డీలోని సాయిసంస్థాన్ వారితో సాయిబాబా దేవుడు, గురువు కాదని చెప్పామన్నారు. సాయిబాబా ఎవరని, ఆయన పుట్టుక ఏమిటని తాము స్వయంగా ప్రశ్నించినట్లు తెలిపారు. ఇంతవరకు ఆ సంస్థాన్ నుండి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. స్వయానా 70 సంవత్సరాల క్రితం సాయిబాబా తాను ముస్లింనని స్వయంగా చెప్పారన్నారు.
షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్ఛరిత్ర పుస్తకాన్ని పరిశీలిస్తే సాయిబాబా పుట్టక వివరాలు తెలుస్తాయన్నారు. కాని ఆ సంస్థాన్ నిర్వాహకులు ఆ పుస్తకాలను ప్రస్తుతం బహిర్గతం చేయడం లేదన్నారు. మరికొంతమంది సాయిబాబా బ్రాహ్మణుడని, మర్రిచెట్టులో 15 రోజుల తరువాత పుట్టారని కాకమ్మ కబుర్లు చెబుతున్నారన్నారు. సాయిబాబాపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని సాయిబాబా భక్తులు ఈనెల 23వ తేదీన హైదరాబాదులో జరగనున్న సభను అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారన్నారు. సాయిబాబా గురించి భక్తులందరు పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విషయంపై సభలో ఉన్న సాయిబాబా భక్తులు ఒక్కసారిగా పైకి లేచి సాయి మహారాజ్‌కు జై అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి సాయిబాబా భక్తులను బయటకు తీసుకెళ్లగా సభ సజావుగా సాగింది. హైదరాబాదులో ఈనెల 23వ తేదీన సభ యథావిధిగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ధర్మాన్ని కాపాడినప్పుడే మన సంస్కృతి సంప్రదాయాలు పది కాలాలపాటు విరాజిల్లుతాయన్నారు. ప్రస్తుతం సమాజంలో స్ర్తిలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం మత్తుపదార్థాలేనని అన్నారు. మత్తుపదార్థాలను తీసుకోవటం వల్ల బుద్ధి కోల్పోయి ఏమి చేస్తున్నామో కూడా అర్ధంకాని పరిస్థితిలో స్ర్తి, పురుషులు ఇద్దరు ఉన్నారన్నారు.
అనంతరం స్వామిజీ శిష్యుడు పంపానది పీఠాధిపతి గోవిందనందా సరస్వతి మాట్లాడుతూ ప్రతిఒక్కరు భగవంతున్ని పూజించాలని కోరారు. సాయిబాబా భక్తులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈసందర్భంగా స్వామిజీ స్వరూపానందా మహారాజ్ దేవుడి రూపంలో ఉన్న సాయిబాబా పోస్టర్లను ప్రజలకు చూపించి సాయినాథుడు దేవుడు కాదని భక్తులకు ఉద్బోధించారు. అనంతరం రామభక్తికి అందరు పాత్రులు కావాలని భక్తులచేత ప్రమాణం చేయించారు.

చిత్రం.. ఒంగోలులో ఏర్పాటు చేసిన స్వామీజీ సభలో పోలీసులతో సాయ భక్తుల వాగ్వాదం