ఆంధ్రప్రదేశ్‌

ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయను : శత్రుచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, అక్టోబర్ 18: ఇకపై ఎంపి, ఎమ్మెల్యే వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు ప్రకటించారు. మంగళవారం విజయనగరం జిల్లా కురుపాంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంతవరకు ఎమ్మెల్యేగా, ఎంపిగా, మంత్రిగా ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి పదవులు వరించే అవకాశం వస్తే పార్టీకి, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తనపై వచ్చిన జీతభత్యాల రికవరీకి సంబంధించిన హైకోర్టు తీర్పు టీ కప్పులో తుపాను వంటిదని పేర్కొన్నారు. ఇది అంతపెద్ద అంశమేమీ కాదని, హైకోర్టు సింగిల్‌బెంచ్ తీర్పునిచ్చిందన్నారు. అప్పీలు చేసుకునేందుకు నెల రోజులు గడువు ఉన్నందువల్ల డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేస్తానన్నారు. తాను గిరిజనుడిగా పేర్కొనేందుకు తగిన ఆధారాలు లేనందువల్ల తనను గిరిజనుడిగా పేర్కొనాలని హైకోర్టుకు వెళ్ళానన్నారు. కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గడపగడపకూ వైకాపా పేరుతో పేరంటాళ్లు ఇళ్లకు బొట్టుపెట్టడం వంటిదన్నారు.