ఆంధ్రప్రదేశ్‌

అంబరాన్ని తాకిన సిరిమాను సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 18: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. మంగళవారం సాయంత్రం సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు అశేష భక్తజనంతో విజయనగరం నిండిపోయింది. ముందుగా ప్రకటించిన సమయానికి సిరిమాను ఇరుసు సీల అమర్చడంలో సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో గంటన్నర ఆలస్యంగా వేడుక ఆరంభమైంది. కోట నుండి మూడు లాంతర్ల వరకు నిండిన భక్తజనం జేజేల నడుమ అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను రథం కదిలింది. సిరిమానును అధిరోహించిన ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావును భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. సిరిమాను రథాన్ని అనుసరిస్తూ అగ్రభాగాన జాలరివల, అంజలి రథం, ఏనుగు అంబారి, పాలధార , అమ్మవారి దీక్షాధారులు, పైడిమాంబ సేవకులు, పైడితల్లి ఆలయ వాయిద్య బృందం అనుసరించాయి. మూడుసార్లు సిరిమాను రథం కోట ముంగిటకు చేరుకుని కోట శక్తికి నమస్కారం చేయడం, అదేవిధంగా ఉత్సవంలోని రథాలు కోటకు ప్రణమిల్లడంతో భక్తజనం పులకించిపోయింది. కోట పైభాగాన ఈశాన్యం వైపుగల కోట బురుజునుండి ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద్రమంత్రి అశోక్‌దంపతులు, మంత్రి కిమిడిమృణాళిని కుటుంబ సమేతంగా సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కాళిదాసురంగారావుపర్యవేక్షణలో రెండు వేలమంది పోలీసు యంత్రాగం, కలెక్టర్ వివేక్ యాదవ్ నేతృత్వంలోని రెవెన్యూ యంత్రాంగం , దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. మూడు లక్షలకు పైగా భక్తులు ఈ ఉత్సవాలను తిలకించారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రశాంతంగా ముగిసాయి.

విజయనగరంలోని మూడు లాంతర్లు జంక్షన్ నుంచి కోట వరకూ తిరుగుతున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను రథం. రథంపై ఆలయ ప్రధాన పూజారి భాస్కరరావు