ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్రపై రెచ్చగొట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలను ఆదేశించారు. సోమవారం పోలవరం పనులను సమీక్షించిన నేపథ్యంలో ఆయన తెదేపా ఎమ్మెల్యేలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బాబు చర్చలో రావులపాలెం నుంచి ప్రారంభం కానున్న ముద్రగడ పాదయాత్రపై చర్చ జరిగింది. ముద్రగడ పాదయాత్రపై రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడవద్దని, ఆ అవసరం మనకు అవసరం లేదన్నారు. ‘ఆయన డిమాండ్ల కోసం ఆయన పాదయాత్ర చేస్తున్నారు. కానీ మనం కాపులకు ఏం చేశామో కాపులకు తెలుసు. అయినా మనం ఏమీ చేయడం లేదని ముద్రగడలాంటి వాళ్లు కొంతమంది మాట్లాడుతుండటం వల్ల ఏర్పడే గందరగోళాన్ని తొలగించి, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని మాత్రం విస్మరించకూడదు. మనం ఏమీ చేయడం లేదన్న వాళ్ల విమర్శలపై వాస్తవాలతో ఎదురుదాడి చేయండి. దానిపై వౌనంగా ఉండాల్సిన పనిలేదు. కానీ ఎక్కడా రెచ్చగొట్టవద్దు. మనం చేసింది చెప్పుకోవడంలో ఎవరికీ భయపడాల్సిన పనిలేద’ని వ్యాఖ్యానించారు.
అదే సందర్భంలో బీసీలపైనా బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాపులకు రిజర్వేషన్ల నేపథ్యంలో బీసీలకు వాస్తవాలు వివరించాలన్నారు. ‘మన పార్టీకి బీసీలే ఆధారం. వాళ్లు లేకపోతే పార్టీ లేదు. గత ఎన్నికల్లో బీసీలంతా పార్టీకి ఓటు వేశారు. వారి రుణం తీర్చుకోవాలి. అందుకే బీసీల కోసం అనేక పథకాలు పెడుతున్నాం. వాటి గురించి ఎక్కువ ప్రచారం చేయండి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బీసీల జీవితాలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా మెరుగుపడింది. చాలామంది కీలకపదవులు పొందారు.
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనం బీసీ విధానాల నుంచి వైదొలగేదిలేదు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నాం. దానికోసం కమిషన్ వేశాం. ఇనే్నళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీగానీ, వైఎస్ ప్రభుత్వం గానీ కాపులను రాజకీయంగా వాడుకోవడమే తప్ప వారికి చేసిందేమీ లేదు. మనం ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నాం. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకూడదు. ఇదే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పండి. కాపు రిజర్వేషన్లపై బీసీల్లో ఆందోళన లేకుండా వాస్తవాలను మీరు తీసుకువెళ్లండ’ని బాబు ఆదేశించారు.