ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్, వైకాపా తోడుదొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఏపీలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను 420 గా అభివర్ణించారు. రైతులను వ్యవసాయరంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టిచుకోలేదన్న జగన్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.