ఆంధ్రప్రదేశ్‌

బాబుకు అంబాసిడర్.. చినబాబుకు ఆడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్పు తీసుకుని నిర్మిస్తున్నట్లు ఆయన కుమారుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు. అప్పులు పోగా ఆయనకు మిగిలిన ఆస్తుల విలువ కేవలం రూ.68 లక్షలు ఉన్నాయని ఆయన వివరించారు. మనవడు దేవాంశ్‌కు మాత్రం తాతకు మూడింతల స్థిరచరాస్తులు ఉన్నాయి.. ఇక లోకేష్‌కూ అప్పులున్నాయి.. సిఎం సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణిలు పెట్టుబడులు.. డిపాజిట్లతో స్థిర, చరాస్తులు సాధించుకున్నారు.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో ఏ రాజకీయ పార్టీ నేతలు ఇప్పటి వరకు కుటుంబ ఆస్తులు ప్రకటించలేదు.. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఆరేళ్లుగా మా ఆస్తుల వివరాలు బహిరంగ పరుస్తున్నాం.. మాకు అక్రమ సంపాదనలు లేవు.. హెరిటేజితో వ్యాపారంచేసి లాభాలు గడిస్తున్నాం.. నిబద్ధత కలిగిన కుటుంబంగా గుర్తింపు పొందాం’’ అని అన్నారు. తన తల్లి భువనేశ్వరి పేరిట 1992లో స్థాపించిన హెరిటేజి సంస్థ వ్యాపారం నిరుడు 2వేల 381 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని, రూ.55 కోట్ల లాభాలు వచ్చాయని ఆయన వివరించారు. నాణ్యత ప్రమాణాలను పాటించటంతో పాటు 7రాష్ట్రాల్లో రోజుకు 13లక్షల లీటర్ల పాల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సంస్థ వల్ల 20వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. సంస్థ అవలంబిస్తున్న కార్పొరేట్ గవర్నెన్స్‌కు లండన్‌లో మంగళవారం భువనేశ్వరి ప్రతిష్ఠాత్మకమైన అవార్డును కూడా అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేసినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంస్థ గుర్తింపు పొందిందన్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి జూబ్లీహిల్స్‌లో సొంతిల్లు నిర్మించుకుంటున్నామని ఇందుకు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు చెప్పారు.
బాబుకు నికరంగా మిగిలింది రూ. 68లక్షలే
ముఖ్యమంత్రి చంద్రబాబు స్థిర చరాస్థుల విలువ 3కోట్ల 73లక్షల 45వేలు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 65లో 1125 చదరపు గజాల ప్లాటులో నిర్మించిన ఇల్లు 3కోట్ల 68లక్షల 34వేలు కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకున్నారు. బ్యాంకుకు ఇంకా బకాయి చెల్లించాల్సి ఉంది. కాగా, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో 0.97 ఎకరంలో ఇల్లు, అంబాసిడర్ కారు చంద్రబాబు గిఫ్టుగా పొందారు. బాబు పేరిట లక్ష రూపాయల ఎన్‌ఎస్‌ఎస్ సర్ట్ఫికెట్లు, 3.59 లక్షల బ్యాంకు బాలెన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.3.06 కోట్ల రుణం పోగా నికర ఆస్తుల విలువ 67 లక్షలు మాత్రమే సిఎంకు మిగిలింది.

హెరిటేజి ప్రధాన షేర్‌హోల్డర్ భువనేశ్వరి.. పంజాగుట్ట.. శ్రీపెరంబదూర్, రంగారెడ్డి జిల్లాలో భూములు
ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి హెరిటేజి ఫుడ్స్‌లో ప్రధాన షేర్ హోల్డర్‌గా ఉన్నారు. వివిధ కంపెనీలలో పెట్టుబడులు.. షేర్ల విలువ రూ. 19.95 కోట్లు కాగా హైదరాబాద్ పంజాగుట్టలో 650 చదరపు గజాలు, తమిళనాడు శ్రీపెరంబదూర్ తాలుకాలో 2.33 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఐదెకరాల భూమి బ్యాంకుల తనఖాలో ఉన్నాయి. హెరిటేజి అనుబంధ సంస్థలు, నిర్వహణ హోల్డింగ్స్, మెగాబిడ్ ఫైనాన్స్ సంస్థలలో పెట్టుబడులతో పాటు కోటీ 73 లక్షల 58వేల ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి. నెట్ ఎసెట్స్ రూ. 24 కోట్ల 80 లక్షలుగా తేల్చారు.
లోకేష్‌కు నికరంగా రూ. 24.84 కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల 1285 చదరపు గజాల్లో లోకేష్ నివాసం విలువ 3కోట్ల 68లక్షల 34 వేలు కాగా నాయనమ్మ నుంచి గిఫ్టుగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఐదెకరాల భూమి, మదినాగూడలో 2.21 కోట్ల విలువైన ఫాంహౌస్ ఉన్నాయి. ఈ మూడు బరోడా బ్యాంకు తనఖాలో ఉండటంతో లోకేష్‌కు సైతం అప్పుల తిప్పలు తప్పలేదనేది స్పష్టమవుతోంది. కాగా లిస్టెడ్ కంపెనీలలో రెండుకోట్ల 52 లక్షల విలువైన షేర్లు, అన్‌లిస్టెడ్ కంపెనీలలో షేర్లతో పాటు 5.86లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌తో కలుపుకుని 14కోట్ల 50 లక్షల ఆస్తులు ఉన్నాయి. ఇవికాక కోటీ 27లక్షల విలువగల 3519 గ్రాముల బంగారు ఆభరణాలు, 4.57లక్షల మేర 32.7 కిలోల వెండి, 91.93 లక్షల ఖరీదైన ఆడికారు, ద్రవ్యరూపంలో ఆస్తులు 7కోట్ల 75లక్షలు, రూ. 6.41 లక్షల మేర బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి. అప్పులు రూ. 13.82 కోట్లు కాగా నికర ఆస్తుల విలువ 24.84 కోట్లు మిగిలింది.

బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 12.75 కోట్లు

లోకేష్ భార్య బ్రాహ్మణికి రూ. 12.75 కోట్ల విలువైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం, జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 19లో 650 గజాలు, చెన్నయ్ టెంపుల్ స్టెప్స్‌లో 4782 చదరపు అడుగుల వాణిజ్య ప్లాటు, రంగారెడ్డి జిల్లా మణికొండలో రిజిస్ట్రేషన్ కావాల్సిన 2440 చదరపు గజాల స్థలాలు ఉన్నాయి. వివిధ కంపెనీలలో పెట్టుబడులు 78లక్షల 51వేలు, 2325.34 గ్రాముల బంగారు, 97.441 కిలోల వెండి ఆభరణాలు రూ. 25.92 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఇతరత్రా కలుపుకుని రూ. 25.92 లక్షలకు గాను 42.18లక్షల అప్పులు పోగా 12కోట్ల33లక్షల మేర ఆస్తులు ఉన్నాయి.

దేవాంశ్‌కు 2.04కోట్ల ఎఫ్‌డి.. బాలకృష్ణ గిఫ్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు దేవాంశ్ పేరిట బాలకృష్ణ రూ. 2.04 కోట్ల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 36లో దేవాంశ్‌కు రూ. 9.17 కోట్ల విలువగల 1191 చదరపుగజాల స్థలంతో పాటు 2.87 లక్షల వెండి ఆభరణం, రూ. 2.31లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఇతరత్రా కలుపుకుని 11కోట్ల 32లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు లోకేష్ వివరించారు.