ఆంధ్రప్రదేశ్‌

మరణిస్తూ..ఆరుగురి జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు గంగుల వంశీకృష్ణ తాను చనిపోతూ తన అవయవాలను దానం చేయడం ద్వారా మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక కొన్ని గంటలు... కొన్ని క్షణాల్లో వంశీకృష్ణ చనిపోతున్నాడు.. కనీసం మరికొందరికి ప్రాణం పోసి వారి పండంటి జీవితాలను కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో అవయవాల దానంకు ముందుకువచ్చిన కుటుంబ సభ్యులకు యువత, ప్రజానీకం జేజేలు పలుకుతున్నారు.
నందిగామ మండలం పెద్దవరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న గంగుల వేణుగోపాల్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వంశీకృష్ణ డిగ్రీ పూర్తిచేసి జగ్గయ్యపేటలోని వండర్ ఇంజనీరింగ్ కంపెనీలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి దాహమంటూ లేచి మంచినీరు తాగాడు. తెల్లవారేసరికి జ్వరంతో బాధ పడుతుంటే కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లి కొన్ని మందులు వాడారు. తలనొప్పి, జ్వరం తీవ్రతరం కావటంతో ఆదివారం రాత్రి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కోమాలోకి వెళ్లినట్లు మెదడులో రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. కొద్దిసేపటికే బ్రెయిన్‌డెడ్ అని వెల్లడించారు. కొంతసేపు బాధపడినా వంశీ కృష్ణ అవయవాలను జీవన్ దాన్ ద్వారా దానం చేసేందుకు ముందుకొచ్చారు.
ఆసుపత్రి ఎండి డాక్టర్ రమణమూర్తి నేతృత్వంలో వైద్యులు క్షణాల్లో కార్యరంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి అవయవాల తొలగింపు చర్యలను చేపట్టారు. ముందుగా గుండెను హైద్రాబాద్‌లోని అపోలోకు, కాలేయాన్ని యశోద ఆసుపత్రికి తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆ అవయవాలను హైదరాబాద్‌కు తరలించారు. రెండు మూత్రపిండాల్లో ఒకదాన్ని స్థానిక ఆయుష్, మరోదాన్ని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి, రెండు కళ్లను వాసన్ ఐ కేర్ ఆసుపత్రులకు క్షణాలపై తరలించారు. మధ్యాహ్నం వంశీకృష్ణ భౌతికకాయాన్ని జగ్గయ్యపేటకు తరలించారు. ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు ఎదురేగి ర్యాలీని నిర్వహించారు. కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని కొనియాడారు. శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఉదార భావాన్ని కొనియాడదగినదంటూ తన అవయవాలను కూడా దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెబుతానన్నారు. మాజీ శాసనసభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ సకాలంలో వైద్యులు వ్యాధిని నిర్ధారించలేకపోయారని అన్నారు. వీరిది సామాన్య కుటుంబమైనందున ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

బ్రెయిన్‌డెడ్ అయన గంగుల వంశీకృష్ణ