ఆంధ్రప్రదేశ్‌

ఏపికి ‘గృహకల్ప’ భవనం ఇద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో కావాలని కోరితే నాంపల్లిలోని ‘గృహకల్ప’ భవనం ఇవ్వాలని మంత్రిమండలిలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో తాము ఖాళీ చేసిన భవనాలను అప్పగిస్తే వారికి ఏ భవనం ఇద్దామన్న చర్చ మంత్రిమండలిలో జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా లక్ష చదరపు అడుగులు కలిగిన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ అడగవచ్చని, గృహకల్ప భవనం అయితే వారు కోరినవిధంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్టు తెలిసింది. ఇలా ఉండగా ప్రస్తుత సచివాలయ భవనాన్ని ఎందుకు కూల్చాలని నిర్ణయించిందీ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ సహచరులకు వివరిస్తూ నిజాం నుంచి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఎవరికి కూడా ప్రస్తుత సచివాలయం భవనం కలిసి రాలేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయంనుంచి పాలన సాగించిన ఏ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ ప్రశాంతంగా ఉండలేదని ముఖ్యమంత్రి గుర్తు చేసినట్టు తెలిసింది. అలాంటి భవనం మనకెందుకు అందుకే దానిని కూల్చేసి వాస్తుకు అనుగుణంగా కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. కొందరికేమో ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త భవనాన్ని కట్టాల్సిన అవసరం ఏముందుని అనుకుంటున్నారని, ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్న దాంట్లో కొత్త సచివాలయం నిర్మాణానికి అయ్యే ఖర్చు పెద్దగా లెక్కేమి కాదని సిఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మిషన్ భగీరథను గడువులోగా పూర్తి చేయడంపై మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని సిఎం సూచించినట్టు తెలిసింది. ఇలా ఉండగా మంత్రిమండలిలో ప్రధానంగా కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చ ఉండటం వల్ల న్యాయపరమైన సలహాల కోసం అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని, ప్రభుత్వ నీటిపారుదల రంగం సలహాదారుడు ఆర్ విద్యాసాగర్‌రావు ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశానికి హాజరయ్యారు. మిషన్ భగీరథపై చర్చ ఉండటంతో దాని వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని అలాగే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డిని కూడా సమావేశానికి ఆహ్వానించారు.