ఆంధ్రప్రదేశ్‌

వెబ్‌సైట్‌లో ఆలయాల ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌కు చెందినదేనని, దీనిపై ఇతర రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు సంక్రమించవని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు స్పష్టం చేశారు. విశాఖలో దేవాదాయ శాఖ అధికారుతో శనివారం సమీక్షించిన ఆయన తనను కలిసి విలేఖరులతో మాట్లాడుతూ టిటిడి ఆదాయంలో తెలంగాణ వాటా కోరడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, ఇది అసంబద్దమని పేర్కొన్నారు. ఈ అంశంపై టిటిడి న్యాయస్థానాన్న ఆశ్రయిస్తే, ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల వివరాలు, ఆస్తులు, ఇతర అంశాలు సహా న్యాయస్థానం వాజ్యాల్లో ఉన్న ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. దేవాలయాల స్థితిగతులు, భూముల విషయంలో నెలకొన్న కేసులు, ఉద్యోగుల సమస్యలు, భక్తులకు సదుపాయాల కల్పన వంటి అంశాలపై లోతైన అధ్యయనం జరుగుతోందన్నారు. దేవాలయాల ఆదాయ, వ్యయాలపై పూర్తి స్పష్టత అవసరమని, దీనిక అనుగుణంగానే ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన చేసేందుకు వీలుంటుందన్నారు. అలాగే న్యాయస్థానాల్లో నలుగుతున్న దేవాదాయ భూముల కేసులు సత్వరమే పరిష్కారమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాల వారీగా దేవాలయాలు చెల్లిస్తున్న సిజిఎఫ్, ఇఎఎఫ్, అర్చక సంక్షేమం, ఆడిట్ తదితర అంశాలపై కూడా పూర్తి సమీక్ష జరుగుతుందన్నారు. అర్చకులకు కనీస వేతనాలు అమలు చేస్తామని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. దేవాలయాల్లో నిత్య ధూప,దీప నైవేద్యాలు ఎంత ముఖ్యమో అర్చకు జీతాలు అంతే ముఖ్యమని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతకు ముందు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దేవాలయాలు, అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ, సంయుక్త కమిషనర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.