ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఎత్తుకు బాబు పైఎత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి. పార్టీకి రాజీనామా చేయకుండా టిడిపిలో చేరిన భూమా బృందంపై అనర్హత వేటు వేయించడానికి వైకాపా అధ్యక్షుడు జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా చివరి అస్త్రాన్ని జగన్ మంగళ, బుధవారాల్లో అసెంబ్లీలో ప్రయోగించనున్నారు. ఆ అస్త్రాలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు తన పొలిటికల్ సీనియార్టీని కొంత వరకూ ఉపయోగించబోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా జరగనున్న ఈ హోరా హోరీ పోరులో అనేక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకించేందుకు జగన్ ముందుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది వీగిపోయింది. ఆ తరువాత స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాసం ఆదిలోనే బెడిసి కొట్టింది. ఈ రెండితో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్ఠను కొంతైనా నిలబెట్టుకునేందుకు రోజాను అడ్డంపెట్టుకోవాలని ప్రయత్నించారు. ఆ కథ కూడా రక్తికట్టకుండాపోయింది. చివరిగా మంగళ, బుధవారాల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యితిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుని, తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయించారు జగన్. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ విప్‌ను తీసుకోలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌తో విప్ పత్రంపై బలవంతంగా సంతకాలు చేయించుకోవాలేని చూసి, భంగపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసిన జగన్ సభలో డివిజన్ కోరనున్నారు. తద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలన్నది జగన్ ఆలోచన. కానీ పరిస్థితి అంత వరకూ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
బేరసారాలు
వైకాపా నుంచి కొద్ది రోజుల కిందట భూమాతోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్యను మరింత పెంచి, జగన్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా నాయకులతో టిడిపి ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా వైకాపాలో కీలక పాత్ర పోషిస్తున్న జ్యోతుల నెహ్రూను టిడిపిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు భోగట్టా. చెన్నై నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జ్యోతుల వర్గీయులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రం ఈ భేటీ జరిగిందనే చెపుతున్నారు.
ఇప్పటికే వరుపుల సుబ్బారావు టిడిపికి వెళుతున్నట్టు ప్రకటించారు. అలాగే అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చాలా కాలంగా టిడిపిలోకి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన కొణాల రామకృష్ణతో కలిసి టిడిపిలోకి వెళ్లాలనుకున్నారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న టిడిపి సర్వేశ్వరరావుకు కూడా గ్యాలం వేసింది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సర్వేశ్వరరావు కోరినట్టు సమాచారం. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదని, గిరిజన సహకార సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇందుకు సర్వేశ్వరరావు అంగీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కొద్ది రోజుల కిందటే వైకాపా నుంచి బయటకు వెళ్లిపోవాలనుకున్నారు. కానీ జగన్ బుజ్జగించడంతో ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. సుజయకృష్ణ రంగారావు మంత్రి పదవి కోరినట్టు, అందుకు బాబు అంగీకరించనట్టు తెలిసింది. సుజయకృష్ణ రంగారావుతోపాటు, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలను తీసుకురమ్మనమని సుజయకృష్ణ రంగారావుపై టిడిపి అథిష్ఠానం వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇక విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడుకి కూడా టిడిపి గ్యాలం వేస్తున్నట్టు భోగట్టా. వీరితోపాటు రాయలసీమ జిల్లాల నుంచి కూడా వైకాపా ఎమ్మెల్యేలను తన గూటికి రప్పించుకునేందుకు బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ టిడిపి వ్యూహం
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగడానికి కేవలం మరో 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈలోగా వలస ఎమ్మెల్యేల సంఖ్యను 10 నుంచి 15కు పెంచాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఇలా వచ్చిన ఎమ్మెల్యేలంతా సభకు హాజరై, తమను వేరే గ్రూపుగా గుర్తించమని స్పీకర్‌ను కోరబోతున్నట్టు సమాచారం. అప్పుడు వాళ్లు ఏ పార్టీకీ ఓటు వేయనక్కర్లేదని, అనర్హత వేటు కూడా పడకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, అది తేలే లోగా ఎమ్మెల్యేల కాలపరిమితి ముగిసిపోతుందని టిడిపి అధిష్ఠానం ఆలోచన.