ఆంధ్రప్రదేశ్‌

శంకుస్థాపనలు అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 28: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్ నిర్మాణాలకు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గుంటూరులో 550 కోట్లతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి, విజయవాడలో మరో 500 కోట్లతో నిర్మించే స్టాంవాటర్ ప్రాజెక్టులతోపాటు రాజధానిలో అంతర్గతంగా 7 యాక్సిస్ రోడ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి శంకుస్థాపన చేశారు. సుమారు 15వేలకోట్ల అంచనావ్యయంతో ప్రభుత్వ భవనాలు నిర్మితం కానున్నాయి. 2019 నాటికి శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్‌లతోపాటు 1350 ఎకరాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, మంత్రుల పేషీలు రూపుదిద్దుకోనున్నాయి. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పి అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, స్పీకర్ కోడెల, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కంభంపాటి హరిబాబు, డిప్యూటీ సిఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.