ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష వైకాపా సభ్యులు సోమవారం శాసనసభను జరగకుండా అడ్డుకున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను కేవలం గంట వ్యవధిలో రెండుసార్లు వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ కేసులో చర్చించాలని, ఇందుకు తాము ఇస్తున్న వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని ప్రతిపక్షం కోరింది. ప్రశ్నోత్తరాలను ముందు చేపట్టి, ఆ తర్వాత అజెండా ప్రకారం ముందుకెళదామని స్పీకర్ కోడెల చెప్పారు. ఎలాగూ ఈ అంశంపై సాయంత్రం చర్చ జరుగుతుందని, అప్పుడు ప్రభుత్వం వివరణ ఇస్తుందని ప్రతిపక్షానికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు అంగీకరించని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన స్థానంలో కూర్చుని ఉన్నారు. బిఎసిలో మీరే అంగీకరించి, మీ మాటకు మీరే కట్టుబడి ఉండకపోతే ఎలా, ఇది మంచి పద్ధతి కాదని స్పీకర్ ప్రతిపక్షంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. శాసనసభ బాగా జరుగుతోందన్న పేరు వచ్చిందని, ఆ పేరును చెడగొట్టకుండా ప్రతిపక్షం సహకరించాలని అన్నారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ ఐదు నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అనంతరం 9.55 గంటలకు సభ తిరిగి ప్రారంభంకాగానే మళ్లీ వైకాపా సభ్యులు అదే ధోరణి ప్రదర్శించారు. పోడియం వద్దకు వెళ్లి అగ్రిగోల్డ్ కేసు చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని, ఇప్పుడే చర్చించాలని పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు ఇలాగే ప్రవర్తిస్తే నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు తదితరులు కూడా ప్రతిపక్ష తీరుపై విరుచుకుపడ్డారు. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మరో రెండు సార్లు వాయిదా వేశారు. సభ 11.15కి ప్రారంభమయ్యాక కూడా వైకాపా సభ్యులు అనంతరం ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ భోజన విరామ సమయం తర్వాత ఈ అంశాన్ని చర్చిద్దాం, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వైకాపా సభ్యులు ఆందోళన విరమించారు.