ఆంధ్రప్రదేశ్‌

భీమిలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, నవంబర్ 8: అదాయానికి మించి ఆస్తులు సంపాదించి హైదరాబాద్‌లో సోమవారం ఎసిబికి చిక్కిన భీమిలి సబ్ రిజిస్ట్రార్ బిల్ల సంజీవయ్యను ఎసిబి అదికారులు ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అరెస్ట్ చేశారు. ఎసిబి డిఎస్పీ, సిఐ (సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ టీం) దర్యాప్తు అధికారి ఎస్‌విఎస్ ప్రసాదరావువిలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రకాశం జిల్లా బల్లికరవ మండలం పెద అంబడిపూడి గ్రామానికి చెందిన సంజీవయ్య 1996లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఆయన బల్లికురువ మండలంలో ముప్పై మూడున్నర ఎకరాలు భూమి కొనుగోలు చేశారన్నారు. అలాగే 12 ఎకరాలు కొని వెంటనే అమ్మేశారని తెలిపారు. హైదరాబాద్, గుంటూరు, మార్టూరు, అద్దంకిల్లో 2 ఇళ్లు, ఒక మూడంతస్తుల భవనం, సరూర్‌నగర్‌లో అపార్టుమెంట్ సంజీవయ్యకున్నాయన్నారు. బ్యాంకు లాకరులో రూ.18 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 2 కేజీల వెండి, రూ.10లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అతను, అతని భార్య పేరున రూ.12లక్షల డిపాజిట్, సంజీవయ్య తండ్రి నారాయణ పేరుమీద ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయన్నారు. అతని పేరు మీద తెల్లరంగు రేషన్ కార్డు ఉందని ఎసిబి డిఎస్పీ తెలిపారు. ఎసిబి లెక్కల ప్రకారం అక్రమార్జన రూ.3 కోట్ల వరకు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.50 కోట్ల విలువ ఉంటుందన్నారు.